ఇండియన్ 2 చిత్రం షూటింగ్లో ముగ్గురు టెక్నీషియన్స్ మృతి చెందగా పలువురికి గాయాలు అయిన విషయం తెల్సిందే. మృతి చెందిన టెక్నీషియన్స్ కుటుంబాలకు కమల్ కోటి రూపాయల ఆర్థిక సాయంను ప్రకటించాడు. నిర్మాణ సంస్థ కూడా చనిపోయిన వారి కుటుంబాలకు పెద్ద మొత్తంలో ఆర్థిక సాయంను ప్రకటించబోతుంది. ఈ విషయాలను పక్కన పెడితే ప్రస్తుతం దర్శకుడు శంకర్ గురించి తమిళ సినీ ఇండస్ట్రీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
శంకర్ కాలుకు తీవ్రంగా గాయాలు అయ్యాయని, ఆయన నడిచే స్థితిలో లేడని ఉదయం వార్తలు వచ్చిన సమయంలో అన్నారు. కాని ఆ తర్వాత ఆయన గురించి ఎలాంటి వార్తలు రాలేదు. అసలు శంకర్ ఆరోగ్యంకు సంబంధించి ఎవరు సరైన సమాచారం ఇవ్వడం లేదు. దాంతో శంకర్ అభిమానులు తీవ్రమైన మానసిక ఆందోళనకు గురి అవుతున్నారు. అసలు శంకర్‌కు ఏమైంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్‌లు పెడుతున్నారు.
వేర్ ఈజ్ శంకర్.. వాట్ హ్యాపెన్ టు శంకర్ అంటూ సోషల్ మీడియాలో తమిళ తంబీలు ట్రెండ్ చేస్తున్నారు. శంకర్ అభిమానుల ఆందోళన తగ్గాలి అంటే ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా శంకర్ ఆరోగ్య వార్తను మీడియా ద్వారా బయటకు చెప్పాలి. లేదంటే శంకర్ కనీసం ఫొటో అయినా నెటిజన్స్‌కు విడుదల చేయాలని అభిమానులు కోరుతున్నారు. అప్పటి వరకు ఈ ఆందోళన తప్పదు. శంకర్ బాగుండాలని అంతా ప్రార్థనలు చేస్తున్నారు.
545780 898526Thank you for your great post! It has long been really insightful. I hope that you will continue sharing your wisdom with us. 617711
611025 218313replica watches are wonderful reproduction of original authentic swiss luxury time pieces. 497955