Switch to English

“కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్” ట్రైలర్ రిలీజ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,197FansLike
57,764FollowersFollow

“కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్” సినిమా ట్రైలర్ హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్‌లో విడుదలైంది. సుమలీల సినిమా బ్యానర్‌పై ఎన్ హెచ్ ప్రసాద్ నిర్మిస్తూ, స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 12న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మానవ సంబంధాలు, సోషల్ ఇష్యూస్, ఆధునిక సమాజంలో చోటుచేసుకుంటున్న వాస్తవ సంఘటనలతో కూడిన ఈ మూవీపై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడిన డీవోపీ శివశంకర వరప్రసాద్ ఈ చిత్రంపై పనిచేయడం తనకు మంచి అనుభవమని చెప్పారు. తక్కువ రిసోర్సెస్‌తోనూ విజువల్లీ క్వాలిటీ తగ్గకుండా సినిమా తీశామని పేర్కొన్నారు. నటుడు దినేష్ ఈ సినిమా తనకు నటుడిగా మరింత గుర్తింపు తెస్తుందనే నమ్మకాన్ని వ్యక్తపరిచారు. దర్శకుడిగా ప్రసాద్‌తో ఇది తన రెండో చిత్రమైతే, కథలో తన పాత్ర చాలా ఇంపార్టెంట్‌గా నిలుస్తుందని అన్నారు.

నటి చంద్రకళా చిత్రం స్క్రిప్ట్ చదివినప్పుడు తాను చేయగలనో లేదో అనిపించినా, సినీ ప్యాషన్ కారణంగా ఛాలెంజ్‌గా స్వీకరించి నటించానని తెలిపారు. ఈ సినిమాలో మనందరం రోజూ చూస్తున్న సోషల్ సమస్యలు, అలాగే ప్రేక్షకులు థియేటర్‌లో కోరుకునే ఎంటర్‌టైన్‌మెంట్ రెండూ ఉన్నాయని చెప్పారు. నటుడు జోగారావు చిన్న సినిమాలు విజయం సాధిస్తేనే కొత్త నటీనటులు, టెక్నీషియన్స్‌కు అవకాశాలు వస్తాయని, ఈ సినిమాకు కూడా మంచి గుర్తింపు వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. బుగత సత్యనారాయణ నేటి సమాజంలో జరిగే సంఘటనలను నిజ జీవితానికి దగ్గరగా ఈ చిత్రం చూపిస్తోందని, చిన్న సినిమాలు వరుసగా సక్సెస్ అవుతున్న తరుణంలో ఈ మూవీ కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందన్నారు.

దర్శక-నిర్మాత ఎన్ హెచ్ ప్రసాద్ మాట్లాడుతూ సినిమాను శృంగారం, మానవ కోరికలు వంటి ఇతివృత్తాలపై ఆధారంగా రూపొందించినా ఎక్కడా అసభ్యత లేకుండా క్లాసీగా తీసినట్టు తెలిపారు. చిన్న సినిమాలకు సెన్సార్‌లో ఎదురయ్యే అసమానతలను ప్రస్తావిస్తూ, తాను సినిమాను పొయెటిక్ టచ్‌తో రూపొందించానని చెప్పారు. కాళిదాసు ‘మేఘదూతం’, జయదేవుడి ‘గీత గోవిందం’ వంటి సాహిత్య రచనల నుంచి కొన్ని భాగాలు చిత్రంలో ఉపయోగించామని వివరించారు. బడ్జెట్ చిన్నదైనా, కంటెంట్ మరియు క్వాలిటీ విషయంలో మాత్రం ప్రేక్షకుల ప్రశంసలు తప్పకుండా వస్తాయని పేర్కొన్నారు.

డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ సమాజంలో బయట ఉన్న మృగాళ్లను శిక్షిస్తున్నా, ఇంట్లో ఉన్న వాటిని గుర్తించలేకపోతున్నాం అనే ఆలోచన చుట్టూ ఈ సినిమా బలమైన సందేశాన్ని ఇస్తుందని అన్నారు. డిసెంబర్ 12న థియేట్రికల్ రిలీజ్‌ను విస్తృతంగా ప్లాన్ చేస్తున్నామని, సినిమా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

సోషల్ థీమ్, కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్, పొయెటిక్ ప్రెజెంటేషన్— కలిపి రూపొందిన “కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్” డిసెంబర్ 12న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమా

CHIRANJEEVI: ముంగిట్లో సంక్రాంతి ముగిసింది.. ధియేటర్లో ‘చిరంజీవి’ పండగ ముగియలేదు

CHIRANJEEVI: సంక్రాంతి పండగొచ్చింది.. ప్రజలను ఊళ్ళకు రప్పించింది.. కుటుంబాల్లో ఆనందాలు నింపింది.. సంబరాలు చేసింది..! వారం రోజుల సంతోషాలు, ఆనందాలు పండగ వెళ్ళిపోవడంతో పండగ సంతోషాలు...

మెగాస్టార్ మళ్లీ రికార్డుల మోత… ‘మన శంకర వరప్రసాద్ గారు’తో చిరు...

సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన స్థాయిని నిరూపించుకున్నారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న ఆయన,...

ఎన్టీఆర్‌ పోలికలే కారణమా? నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్‌కి చోటు దక్కిన...

జూనియర్ ఎన్టీఆర్… తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకమైన పేరు. నటన, డైలాగ్ డెలివరీ, డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు. అయితే...

మీనాక్షి చౌదరి మనసులో ఉన్నది ఇతడేనా? ఫస్ట్ క్రష్‌, పెళ్లి డ్రీమ్‌…...

టాలీవుడ్‌లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. సినిమాల విజయం ఒకవైపు, వ్యక్తిగత విషయాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు...

సంక్రాంతి బాక్సాఫీస్ హీట్… జనవరి 17న ఎవరి దూకుడు ఎంత?

సంక్రాంతి సీజన్‌లో విడుదలైన సినిమాల మధ్య బాక్సాఫీస్ పోరు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. జనవరి 17 నాటికి థియేటర్లలో సందడి చేస్తున్న సినిమాల కలెక్షన్లు ట్రేడ్...

రాజకీయం

కోటరీ కుంపటి.! వైసీపీకి విసారెడ్డి ఉచిత సలహా ఉపయోగపడేనా.?

వెనిజులా అంశాన్ని తీసుకొచ్చి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉచిత సలహా ఇచ్చారు వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి. దాంతో, సహజంగానే వైసీపీలో కొంతమందికి బాగా కాలింది. ఆ...

“YSR పేరుతో నన్ను టార్గెట్ చేస్తున్నారు”: రాధాకృష్ణ వ్యాఖ్యలపై భట్టి విక్రమార్క ఫైర్

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మీడియా – ప్రభుత్వం మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రముఖ జర్నలిస్టు, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ రాసిన కాలమ్‌పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఘాటుగా స్పందించడంతో ఈ...

రాజకీయ వేడి రాజుకుంది.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఘాటు విమర్శలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజాగా జరిగిన సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ,...

టీడీపీని ముంచింది TRS – సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పతనానికి కాంగ్రెస్ కారణం కాదని, అప్పటి TRS పార్టీ మరియు కేసీఆర్ రాజకీయాలే కారణమని స్పష్టంగా చెప్పారు.  టిడిపి ని  ముంచింది...

చంటి బిడ్డతోనే ట్రాఫిక్ క్లియర్ చేసిన పోలీస్‌… నారా లోకేశ్ ప్రశంసల వెల్లువ

కాకినాడ–సామర్లకోట రహదారిపై జరిగిన ఓ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. రంగంపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ చూపిన సేవా మనసును మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. డ్యూటీలో...

ఎక్కువ చదివినవి

మీనాక్షి చౌదరి మనసులో ఉన్నది ఇతడేనా? ఫస్ట్ క్రష్‌, పెళ్లి డ్రీమ్‌… అన్నీ ఓపెన్‌గా చెప్పేసింది!

టాలీవుడ్‌లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. సినిమాల విజయం ఒకవైపు, వ్యక్తిగత విషయాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి....

చంద్రబాబు ఫైర్ స్పీచ్: NTR వర్ధంతి సభలో ప్రతిపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే ఈ విజయాలకు క్రెడిట్ దక్కించుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం...

ప్రేక్షకుల ప్రేమే మా అసలైన విజయం: ‘అనగనగా ఒక రాజు’ థాంక్యూ మీట్‌లో భావోద్వేగ ప్రసంగాలు

సంక్రాంతి కానుకగా విడుదలై థియేటర్లలో నవ్వుల పండగ సృష్టించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’ విజయోత్సాహంతో దూసుకుపోతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, విడుదలైన మొదటి ఆట...

‘వెంకీ పింకీ జంప్’ ఆడియో రిలీజ్…

 విక్రమ్, రమ్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘వెంకీ పింకీ జంప్’ సినిమా ఆడియో విడుదల ఘనంగా జరిగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌పై వెంకట్, బాబా నిర్మాతలుగా,...

రాజకీయ వేడి రాజుకుంది.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఘాటు విమర్శలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజాగా జరిగిన సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ,...