నందమూరి కళ్యాణ్ రామ్.. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్ళైనా ఇంకా తనకంటూ స్థిరమైన మార్కెట్ ను ఏర్పరుచుకోలేదు. ఒక హిట్ వచ్చిందంటే దాన్ని ఫాలో అవుతూ వరస ప్లాపులు రావడంతో కళ్యాణ్ రామ్ కెరీర్ పైకి లేవలేదు. పైగా తన బ్యానర్ లో ఎక్కువ సినిమాలు చేసే కళ్యాణ్ రామ్, తన రేంజ్ ను దాటి చేసిన ఏ ప్రయత్నమైనా దారుణమైన ఫలితాన్ని మిగిల్చింది.
ఆ మధ్య తన మార్కెట్ ను మించి చాలా ఖర్చు పెట్టి 25 కోట్ల బడ్జెట్ తో ఓం అనే 3డి యాక్షన్ పిక్చర్ ను రూపొందించాడు. ఆ సినిమాకు చేసిన అప్పులు చాలా కాలం పాటు తీర్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు తన బ్యానర్ లోనే బింబిసారను చేస్తున్నాడు కళ్యాణ్ రామ్.
టీజర్ చూస్తే గ్రాండ్యుయర్ కు కచ్చితంగా ఆశ్చర్యపోతాం. కొత్త దర్శకుడ్ని పెట్టుకుని కళ్యాణ్ రామ్ ఇలా హిస్టారికల్ మూవీ అంత బడ్జెట్ తో చేయడం ఆశ్చర్యమే. టీజర్ తో సినిమా ఆకట్టుకుంది. మరి కళ్యాణ్ రామ్ ధైర్యానికి అర్ధం ఉండేలా ఈ చిత్రం ఉంటుందో లేదో చూద్దాం.