Switch to English

మాజీ మంత్రి పేర్ని నానిని మళ్ళీ కడిగి పారేసిన న్యాయవాది కళ్యాణ్ దిలీప్.!

91,428FansLike
56,276FollowersFollow

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, ‘కామనర్ లైబ్రరీ’ పేరుతో ఓ యూ ట్యూబ్ ఛానల్ ద్వారా, రాజకీయ, సామాజిక అంశాలపై తనదైన అభిప్రాయాల్ని కుండబద్దలుగొట్టేస్తుంటారు. ఈ క్రమంలో జనసేన పార్టీ మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే విమర్శల్ని మరింత తీవ్రంగా తిప్పి కొడుతుంటారు. పవన్ కళ్యాణ్ మీదా, చిరంజీవి మీదా అమితమైన అభిమానం కలిగిన కళ్యాణ్ దిలీప్ సుంకర, అత్యంత సున్నితంగా, కొన్నిసార్లు చాలా కఠినమైన పదజాలంతో వైసీపీ నాయకుల విమర్శలపై స్పందిస్తుంటారు.

తాజాగా కళ్యాణ్ దిలీప్ సుంకర, మాజీ మంత్రి పేర్ని నానికి యూ ట్యూబ్ ఛానల్ ద్వారా ‘ఉద్బోధ’ చేసేందుకు ప్రయత్నించారు. ‘అవన్నీ నీలాంటోడికి అర్థమయి సత్తాయా.?.’ అంటూనే, విడమర్చి చెప్పేందుకు కళ్యాణ్ దిలీప్ సుంకర మేగ్జిమమ్ ప్రయత్నం చేసినట్టున్నారు.

ఇటీవల జనసేన పార్టీ లీగల్ సెల్‌ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాని పాల్కీవాలా, అంబేద్కర్ తదితరుల గురించి ప్రస్తావిస్తే, అలా ప్రస్తావించడంపై పేర్ని నాని వెటకారం చేసిన విషయం విదితమే. ‘నీకు అలాంటోళ్ళ గురించి తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే నీ స్థాయి అంతే. అక్కడ సమావేశం లీగల్ సెల్‌కి సంబంధించినది. అందుకు తగ్గట్టుగా పార్టీ అధినేత కొన్ని రిఫరెన్స్‌లు తీసుకుంటారు.. అది కూడా నీకు తెలియకపోతే ఎలా..’ అని కడిగి పారేశారు కళ్యాణ్ దిలీప్, పేర్ని నానిని.

విజయదశమి తర్వాత జనంలో వుంటానన్న పవన్ కళ్యాణ్ మాట తప్పారంటూ పేర్ని నాని ఎద్దేవా చేయడంపైనా కళ్యాణ్ దిలీప్ సుంకర తనదైన స్టయిల్లో స్పందించారు. ప్రత్యేక హోదా తెస్తామన్నారు, మద్య నిషేధం చేస్తామన్నారు.. వీటి సంగతేంటి.? అని నిలదీశారు. పవన్ కళ్యాణ్ కాస్త ఆలస్యంగా జనంలోకి వెళ్ళడం వల్ల వచ్చే నష్టం లేదు.. ప్రభుత్వం చెయ్యాల్సినవి సకాలంలో చెయ్యకపోతే నష్టమని కళ్యాణ్ దిలీప్ చెప్పుకొచ్చారు.

‘అయినా, జనంలోకి వెళ్ళడమంటే కోట్లాది రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు చేసేసి, ముద్దులు పెట్టేయడం కాదు.. ఆయా నియోజకవర్గాల్లో, గ్రామాల్లో, మండలాల్లో, పట్టణాల్లో వున్న సమస్యల గురించి ముందస్తు కసరత్తు చేసుకోవాలి.. ప్రజల్లో వున్నప్పుడే పోటీ చేసే నాయకుల్ని ప్రకటించాల్సి రావొచ్చు.. ఇవన్నీ నీలాంటోడికి ఎలా తెలుస్తాయ్.?’ అని ప్రశ్నించారు కళ్యాణ్ దిలీప్.

‘పవన్ కళ్యాణ్ లాంటివాళ్ళను స్ఫూర్తిగా తీసుకునే నాలాంటివాళ్ళు ఇలా స్థిరపడ్డారు.. మీ వైసీపీని ఆదర్శంగా తీసుకుంటే, ఎందుకూ పనికిరాకుండా పోతుంది యువత..’ అంటూ కళ్యాణ్ దిలీప్ సుంకర ఎద్దేవా చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘నవాబ్’ మూవీ కోసం 12 ఎకరాల్లో డంప్ యార్డ్ సెట్

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రంలో రామ రాజ్, మురళీ శర్మ, రాహుల్ దేవ్, శ్రవణ్ రాఘవేంద్ర,...

‘లెహరాయి’ నుండి “బేబీ ఒసేయ్ బేబీ” పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్...

అందం కోసం బుట్టబొమ్మ సర్జరీపై క్లారిటీ

హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం...

బాబోయ్‌ రష్మిక మరీ అంత పెంచేసిందా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో కొన్ని ఆఫర్స్ ని ఈమె కాదన్నట్లుగా...

బిగ్‌బాస్‌ 6 : ఆ సర్వే టాప్‌ 5 లో శ్రీసత్య

ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఓర్మాక్స్ వారు ప్రతివారం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యే సెలబ్రెటీల జాబితాను ప్రకటిస్తూ ఉంటారు. సోషల్‌ మీడియాలో ఎక్కువగా ఎవరి...

రాజకీయం

గులాబీ రాజకీయం.! జాతీయ తెలుగు పార్టీ దిశగా.!

ఇంతలోనే ఎంత మార్పు.? నిజానికి, ఈ మార్పు మంచిదే.! తెలుగు తల్లి ఎవనికి తల్లి.? అని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ‘తెలుగు పార్టీ, జాతీయ రాజకీయాల్లో సత్తా చాటబోతోంది..’ అని...

అమరావతి రైతుల పాదయాత్ర: మంత్రుల బెదిరింపులు.! జనం బేఖాతర్.!

రాజధాని అమరావతి విషయంలో మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారు. జనాన్ని రెచ్చగొడుతున్నారు. అమరావతి నుంచి అరసవెల్లికి జరుగుతున్న మహా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం స్థాయిలో, పార్టీ స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అవి సఫలం...

కేసీయార్ స్కెచ్.! ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్ఎస్ పోటీ.?

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు..’ అని పలు సందర్భాల్లో గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చూశాం. ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్...

‘జ..గన్’ అంటోన్న రోజా.! ‘గన్..జా’ అంటోన్న టీడీపీ.! అసలేంటి కథ.?

ఆడ పిల్లకి అన్యాయం జరిగితే, గన్ కంటే ముందుగా జగన్ అక్కడ వుంటాడంటూ పదే పదే వైసీపీ నేత రోజా చెప్పడం చూశాం. ఎమ్మెల్యేగా వున్నప్పటినుంచీ ఆమె ఇవే మాటలు చెబుతూ వస్తున్నారు....

మొగల్తూరు రాజకీయం.! ప్రభాస్, చిరంజీవి.. అసహనం వ్యక్తం చేసిన వేళ.!

‘మరీ ఇంత నీఛానికి దిగజారుతారా.?’ అన్న చర్చ సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖుల మధ్య జరుగుతోంది. సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి, దివంగత కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమం ఆయన సొంతూరులో నిర్వహించిన...

ఎక్కువ చదివినవి

పూరిని కావాలని కెలుకుతున్న బండ్ల గణేష్‌

పూరి జగన్నాథ్ తనయుడి సినిమా యొక్క ప్రమోషనల్ ఈవెంట్ కు వెళ్లి అక్కడ పూరి జగన్నాథ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్ తాజాగా మరోసారి వివాదాస్పదంగా మాట్లాడాడు. పూరి జగన్నాథ్‌...

బిగ్‌ బాస్ 6 శ్రీ సత్య గురించి ఆసక్తికర విషయాలు

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో ఆరవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన తెలుగు అమ్మాయి క్యూట్ ముద్దుగుమ్మ శ్రీ సత్య. హౌస్ లో కి ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే తనకు...

రాశి ఫలాలు: శనివారం 01 అక్టోబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు ఆశ్వయుజ మాసం సూర్యోదయం: ఉ.5:54 సూర్యాస్తమయం: సా.5:51 తిథి: ఆశ్వయుజ శుద్ధ షష్ఠి రా.8:40 వరకు తదుపరి ఆశ్వయుజ శుద్ధ సప్తమి సంస్కృతవారం: స్థిరవాసరః (శనివారం) నక్షత్రము: జ్యేష్ఠ తె.4:06 వరకు...

మొన్న ‘పే సీఎం’, ఇప్పుడేమో ‘భారతి పే’.! వైసీపీలో ‘బులుగు’ కుంపటి.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే పార్టీ అధినాయకత్వం పట్ల వ్యతిరేకత వుందా.? రెడ్డి సామాజిక వర్గంలో కొందరు, వైసీపీకి ఎదురు తిరుగుతున్నారా.? సోషల్ మీడియా వేదికగా ఈ మేరకు పెద్దయెత్తున రచ్చ జరుగుతోంది. కర్నాటక ముఖ్యమంత్రి...

వరల్డ్స్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌ ముందు ‘నాటు నాటు’ రచ్చ.. ఇది మన సినిమా సత్తా

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి కొన్ని నెలల క్రితం ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో గుర్తింపులను.. గౌరవాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా బియాండ్...