నందమూరి కళ్యాణ్ రామ్ పటాస్ సినిమా తర్వాత ఇప్పటి వరకు సక్సెస్ దక్కించుకోలేక పోయాడు. తన ప్రతి సినిమాకు కూడా ఎంతో కష్టపడే కళ్యాణ్ రామ్ కోసం తమ్ముడు ఎన్టీఆర్ తన వంతు అన్నట్లుగా ప్రమోషన్స్ కోసం హాజరు అవ్వడం.. ఆ తర్వాత సినిమా ఫ్లాప్ అవ్వడం చాలా కామన్ విషయం గా మారింది. వరుసగా ఫ్లాప్ లు అవుతున్న ఈ సమయంలో వచ్చిన బింబిసార సినిమా పై కూడా జనాల్లో పెద్దగా నమ్మకం లేదు.
నందమూరి అభిమానులు సినిమా సక్సెస్ అవుతుందని ఎదురు చూశారు. బింబిసార తో కళ్యాణ్ రామ్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. దాంతో అన్నయ్య విజయం పట్ల ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశాడు. ట్విట్టర్ ద్వారా బింబిసార సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నందున చాలా సంతోషంగా ఉందంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ ట్వీట్ తో బింబిసార స్థాయి మరింతగా పెరిగినట్లు అయ్యిందని అభిమానులు మరియు బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు.