Switch to English

వివాదంలో కల్కి సినిమా .. రైటర్ స్పందన !!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,927FansLike
57,764FollowersFollow

రాజశేఖర్ హీరోగా ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కల్కి’. శివాని, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమా జూన్ 28న ప్రేక్షకుల ముందుకొస్తోంది. విడుదలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో కార్తికేయ అలియాస్ ప్రసాద్ అనే రచయిత ‘కల్కి’ చిత్రకథ తనదేనని తెలుగు చలనచిత్ర రచయితల సంఘంలో ఫిర్యాదు చేశారు. మీడియా ముందుకు వచ్చారు. ఈ వివాదం గురించి తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం సభ్యుడు, కథా హక్కుల వేదిక కన్వీనర్ బీవీఎస్ రవి స్పందించారు.

‘కథా హక్కుల వేదిక’ కన్వీనర్ బీవీఎస్ రవి మాట్లాడుతూ “తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం సుమారు ఏడాదిన్నర క్రితం ‘కథా హక్కుల వేదిక’కు రూపకల్పన చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే… రచయితల సంఘంలో సభ్యులు కాకుండా, కేవలం దర్శకుల సంఘంలో మాత్రమే సభ్యులైన వారి మధ్య సమస్యలను పరిష్కరించడం. ‘కథా హక్కుల వేదిక’ బృందంలో కొంతమంది ఉన్నారు. బయటకు రాని, బయటకు రానవసరం లేని ఎన్నో సమస్యలను ఇరు వర్గాలకు ఆమోదయోగ్యంగా, ఇరు వర్గాలు సంతృప్తి చెందే విధంగా మేం పరిష్కరించాం. ఎన్నో సూపర్ హిట్ సినిమాల ట్రైలర్స్ చూసి తమ కథ అని వచ్చేవాళ్లు చాలామంది ఉంటారు. వాళ్ల కథను, సినిమా కథను మేం చదివి… రెండిటి మధ్య సంబంధం ఉందో లేదో చెబుతాం. కొన్ని కథలు మధ్య సారూప్యతలు కనిపిస్తుంటాయి. ప్రముఖ హిందీ రచయిత జావేద్ అక్తర్ రూపొందించిన కాపీ రైట్ యాక్ట్ పద్దతిలో మేం సమస్యలను పరిష్కరిస్తున్నాం. దీనికి చట్టబద్ధత ఏమీ లేదు. సమస్యలను పరిష్కరించడమే మా ఉద్దేశం.

ఒకవేళ మేం సూచించిన పరిష్కారం, మేం తీసుకున్న నిర్ణయం నచ్చకపోతే… కోర్టుకు వెళ్లొచ్చని కూడా మేం చెబుతాం. అలాగే, ‘కల్కి’కి సంబంధించి కార్తికేయ అని ఒకరు కంప్లయింట్ చేశారు. మేం కార్తికేయ స్క్రిప్ట్, ‘కల్కి’ స్క్రిప్ట్ రెండూ చదివాం. ప్రాధమికంగా మాకు ఎటువంటి పోలిక కనిపించలేదు. సాధారణంగా ఈ విషయాన్ని మేం చెప్పకూడదు. కార్తికేయగారు మీడియా ముందుకు వచ్చారని తెలిసి చెబుతున్నా. ఒకవేళ… ‘కల్కి’ విడుదలైన తరవాత మాకు ఇచ్చిన స్క్రిప్ట్ లో ఉన్నట్టు కాకుండా, కంప్లయింట్ ఇచ్చిన వ్యక్తి స్క్రిప్ట్ లో ఉన్నట్టు అనిపిస్తే డిస్కస్ చేయడం జరుగుతుంది.

ప్రస్తుతానికి మాకు ఎటువంటి పోలిక కనిపించలేదు. సాధారణంగా కంప్లయింట్ చేసిన వ్యక్తి కథ అయితే అతనికి క్రెడిట్, రెమ్యునరేషన్ వచ్చేలా చూస్తున్నాం. అతడి క్రియేటివిటీకి తగిన న్యాయం జరిగేలా చూస్తున్నాం. ఒకవేళ కథల మధ్య పోలికలు లేకపోతే కంప్లయింట్ ఇచ్చిన వ్యక్తితో ‘మీ కథకు సంబంధం లేదు’ అని చెప్పి పంపిస్తున్నాం. ఇలా బయటకు వచ్చి మాట్లాడటం తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘానికి నచ్చని అంశం. ఇలా బయటకు వచ్చి ఆరోపణలు చేస్తే ప్రస్తుతం మా తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్. శంకర్, కార్యదర్శి రామ్ ప్రసాద్ గారితో చర్చించి… నిర్ణయం తీసుకుంటాం” అని అన్నారు.

8 COMMENTS

సినిమా

విజయ్ కింగ్ డమ్.. ఈ తికమక ఏంటి..?

విజయ్ దేవరకొండ కొత్త సినిమా కింగ్ డమ్ టీజర్ లేటెస్ట్ గా రిలీజైన విషయం తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను...

ప్రభాస్ ఫౌజీలో అనుపమ్ ఖేర్..!

రెబల్ స్టార్ ప్రభాస్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ...

త్రివిక్రమ్.. అట్లీ.. ముందు ఎవరితో..?

పుష్ప 2 తో పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాల ప్లానింగ్ తో కూడా ఫ్యాన్స్...

Rashmika: విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ టీజర్ పై రష్మిక పోస్ట్...

Rashmika: విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘కింగ్ డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ రివీల్ చేయడంతోపాటు టీజర్ కూడా లాంచ్...

ఇట్స్ కాంప్లికేటెడ్ ఆడియన్స్ ఎక్సయిట్మెంట్ చూడాలని వుంది : సిద్ధు...

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ కృష్ణ అండ్ హిస్ లీల. ఐదేళ్ల క్రితం 2020 కరోనా టైం లో డైరెక్ట్ ఓటీటీ...

రాజకీయం

మాజీ మంత్రి రోజాకు చెక్ పెడుతున్న వైసీపీ

తిరుపతి జిల్లాలోని నగరి నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు చిన్న కొడుకు గాలి జగదీష్ వైసీపీలో చేరనున్నట్లు వార్తలు రావడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఆయన ఏ...

ఏపీ అభివృద్ధికి తైవాన్ సహకారం..!

ఏపీ అభివృద్ధికి తైవాన్ సహకరించేందుకు ముందుకొచ్చింది. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్, ఫుట్ వేర్ రంగాల అభివృద్ధి కోసం మంత్రి నారా లోకేష్ తైవాన్ సహకారం కోరారు. ఉండవల్లి నివాసంలో తైపేయి ఎకనామిక్...

ఎట్టకేలకు ’జిత్తులమారి‘ వల్లభనేని వంశీ అరెస్ట్.!

వైసీపీ హయాంలో అయితే రాజకీయ ప్రత్యర్థుల్ని ఎడా పెడా అరెస్టులు చేసెయ్యడం చూశాం. ఈ క్రమంలో అప్పటి వైసీపీ ప్రభుత్వానికి తరచూ కోర్టు నుంచి మొట్టికాయలు పడుతుండేవి. అరెస్టులు చేయడం, కస్టోడియల్ టార్చర్...

వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు!

వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని రాయదుర్గం మై హోమ్ భుజా లో ఆయనని పోలీసులు అరెస్టు చేసి విజయవాడకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది....

ఇన్ సైడ్ స్టోరీ: చిరంజీవిని వివాదాల్లోకి లాగితే ఏమొస్తుంది.?

ఆయన మెగాస్టార్ చిరంజీవి.. ఆయన పద్మ భూషణుడు చిరంజీవి.. ఆయన పద్మ విభూషణ్ చిరంజీవి.! కొణిదెల శివ శంకర వరప్రసాద్ అసలు పేరు.! వెండితెరపై చిరంజీవిలా నాలుగు దశాబ్దాలుగా ఓ వెలుగు వెలుగుతున్నారాయన.! సక్సెస్,...

ఎక్కువ చదివినవి

Andhra Pradesh: రాష్ట్రంలో పెట్టుబడులపై మంత్రి లోకేశ్ చొరవ.. ప్రముఖ సంస్థ ఆసక్తి

Andhra Pradesh: రాష్ట్రంలోకి పెట్టుబడులు వచ్చేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఫార్చూన్ 500 కంపెనీ ‘సిఫీ’కు మంత్రి లోకేష్ ఆహ్వానించిన నేపథ్యంలో సిఫీ...

తండేల్ HD ప్రింట్ లీక్..!?

అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా తండేల్. చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు...

ప్రభాస్ ఫౌజీలో అనుపమ్ ఖేర్..!

రెబల్ స్టార్ ప్రభాస్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు....

Kingdom : రౌడీస్టార్‌ ‘కింగ్డమ్’.. అంచనాలు పెంచిన టీజర్‌

Kingdom : రౌడీస్టార్‌ విజయ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంపై ఫ్యాన్స్‌తో పాటు అందరిలోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. 'VD12' అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకి...

ఆలయాల పర్యటన నా వ్యక్తిగతం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాలోని పుణ్యక్షేత్రాల యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటన పూర్తిగా తన వ్యక్తిగతమని ఇందులో ఎలాంటి రాజకీయం లేదని...