ఓ ఎల్ఐసీ ఏజెంట్.. ‘కల్కి’ అవతారమెత్తేశాడు ఏకంగా. కోట్లు.. వందల కోట్ల ఆస్తులు సంపాదించేశాడు. ఓ సామాన్యుడు పొట్ట కూటి కోసం నానా తిప్పలూ పడాల్సి వస్తోన్న రోజులివి. ఓ చిరుద్యోగి నానా తంటాలూ పడితే తప్ప, కుటుంబాన్ని గడప లేని దుస్థితి. కానీ, స్వామీజీ అవతారమెత్తితే ఇక ఎదురే లేదు.
వ్యాపారవేత్తలు బలాదూర్.. రాజకీయ నాయకులైనా, ఉన్నతాధికారులైనా ఆ స్వామీజీ ముందు వంగి వంగి దండాలు పెట్టాల్సిందే. అసలు ఏముంటుంది స్వామీజీల్లో.? ఎప్పటికప్పుడు ఈ ప్రశ్న పుట్టుకొస్తూనే వుంటుంది. దొంగ స్వామీజీలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే వున్నారు. ఇదొక ప్రవాహంగా తయారైంది.
మెజార్టీ స్వామీజీల వెనుక రాజకీయ అండదండలు సుస్పష్టం. అవి లేకపోతే, ఎవడూ స్వామీజీగా మారలేడు. ‘కల్కి’ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. వందల కోట్ల ఆస్తులు కల్కి ఆశ్రమంలో దొరికాయి. ఇక్కడితో ఇలాంటి ఘటనలు పునరావృతం కాబోవని అనగలమా.? కల్కి పట్టుకోవడం కాదు, ఆ కల్కి వెనుకాల వున్న రాజకీయ రక్కసిని పట్టుకోవాలన్నది అందరూ చెబుతున్న మాట.
అన్నట్టు, మీడియాలో ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు గంటల కొద్దీ చర్చా కార్యక్రమాలు జరుగుతాయి. మళ్ళీ అవే న్యూస్ ఛానళ్ళలో దొంగ స్వామీజీలకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు తెరపైకొస్తాయి. డబ్బు పారేస్తే రాజకీయ నాయకులు, అధికారులే కాదు.. మీడియా కూడా ‘బాంచన్..’ అనే స్థాయికి ఈ స్వామీజీలు ఎదిగిపోతున్నారు.
పేర్లు మాత్రమే వేరు.. దాదాపు అందరు స్వామీజీలూ చేసేది ఒకటే. డ్రగ్స్, నల్లధనం, వ్యభిచారం.. ఒకటేమిటి.? చాలా అసాంఘీక కార్యకలాపాలు స్వామీజీల ఆశ్రమాల్లో వెలుగు చూస్తుండడం వార్తల్లో చూస్తూనే వుంటాం. కొన్నిసార్లు స్వామీజీల అరెస్టులూ జరుగుతాయి.. మళ్ళీ కొత్తగా స్వామీజీలు పుట్టుకొస్తూనే వుంటారు. మొన్న నిత్యానంద, ఇప్పుడు కల్కి.. అంతకు ముందు ఇంకొకరు, ఇకపై మరొకరు.. ఈ దొంగ స్వామీజీల ప్రవాహం మాత్రం ఆగదు గాక ఆగదంతే.!
939152 517902I will right away grasp your rss as I can not in locating your e-mail subscription hyperlink or e-newsletter service. Do youve any? Kindly permit me realize so that I could subscribe. Thanks. 370295