Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన సినిమా కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించిన సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. రూ.1000కోట్లు వసూళ్లు సాధించినట్టు పోస్టర్ కూడా రిలీజ్ చేసింది టీమ్. కల్కి ధియేటర్లలో రన్ అవుతున్నా.. సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
అయితే.. అందుతున్న సమాచారం ప్రకారం కల్కి ఓటీటీలోకి రావడానికి చాలా సమయం ఉందని తెలుస్తోంది. 10వారాల తర్వాతే కల్కి ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఈలెక్కన జూన్ 27న విడుదలైన కల్కి సెప్టెంబర్ రెండో వారంలోనే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. ఈమేరకు చిత్ర బృందం అమెజాన్ ప్రైమ్ తో ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది’.
ఇటివల ధియేటర్లలో విడుదలైన సినిమాలు దాదాపు 4వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. మరికొన్ని సినిమాలు రెండు వారాలకే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. అయితే.. సినిమా యూనిట్, ప్రైమ్ ఒప్పందం ప్రకారం,, ఓటీటీలో కల్కి కోసం మరికొన్ని రోజులు ఆగాల్సిందే..!