Kajal: చందమామ కాజల్ అగర్వాల్ ఈ ఉగాది కి ‘ ఘోష్టి ‘ చిత్రంతో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని మార్చి 22 న విడుదల చేయనున్నారు. సీనియర్ నటి రాధిక శరత్ కుమార్, కోలీవుడ్ హాస్య నటుడు యోగి బాబు ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం రూపొందుతోంది. కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గంగా ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేస్తోంది. కళ్యాణ్.. ‘ ‘గులేబకావళి’, జ్యోతిక’, ‘ జాక్ పాట్’ చిత్రాలతో ఆకట్టుకున్నారు.
హారర్, కామెడీతోపాటు థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉన్నాయని.. అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రని కాజల్ అగర్వాల్ పోషించినట్లు నిర్మాత తెలిపారు. కాజల్ ఇందులో ఆరతి అనే పోలీస్ అధికారిణిగా కనిపించనుంది. కేఎస్ రవికుమార్, ఊర్వశి, దేవదర్శిని వంటి తరాగణం ఈ చిత్రంలో కనిపించనున్నారు. పోలీస్ అదికారి అయిన కాజల్.. గ్యాంగ్ స్టర్ ను ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది?
దర్శకుడు కావాలనుకుంటున్న యోగి బాబు మెంటల్ హాస్పిటల్ కి ఎందుకు వెళ్లారు? పోలీస్ ఆఫీసర్ ఆరతికి, యోగి బాబు పాత్రకి ఉన్న సంబంధం ఏంటి? అనే అంశాలు ఆసక్తికరం. కాజల్ విషయానికి వస్తే తెలుగు తెరపై కనిపించి చాలా రోజులైంది. 2020లో గౌతం కిచ్లును వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం కాజల్.. కమల్ హాసన్ హీరో గా నటిస్తున్న ‘ఇండియన్ -2’ తో పాటు ఓ హిందీ చిత్రం లోనూ కనిపించనుంది.