AP Police: మాజీ ఎంపీ, మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్ మెన్ రంగయ్య మృతిని అత్యంత అనుమానాస్పద మృతిగా పరిగణిస్తున్నామని కడప ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ఈమేరకు ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు.
‘కేసులో ప్రధాన సాక్షులు నలుగురు (శ్రీనివాసులురెడ్డి, కువైట్ గంగాధర్ రెడ్డి, వైఎస్.అభిషేక్ రెడ్డి, వాచ్ మెన్ రంగన్న) చనిపోయారు. అందరూ ఒకే తరహా కారణాలతో చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వీటి వెనుక కారణాలు గుర్తిస్తాం. కేసులో వాచ్ మెన్ రంగయ్య అత్యంత కీలకం. అతని మృతిని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాం. ఎక్స్ పర్ట్ టీమ్ తో లోతైన విచారణ ప్రారంభిస్తున్నాం’.
‘హత్య కేసులో నేరుగా ప్రమేయమున్న ముద్దాయిల పాత్ర పై డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపిస్తాం. సాక్షులుగా ఉన్నవారు ఎందుకు మరణిస్తున్నారో నిగ్గు తేల్చి బహిర్గతం చేస్తాం. సాక్షులు చనిపోతే సీబీఐ, పోలీసులపై నెపం వేయటం సరికాదు. సాక్షుల మరణాలపై సైంటిఫిక్ ఎవిడెన్స్ తో దర్యాప్తు కొనసాగుతుంద’ని అన్నారు.