Switch to English

ఓటిటి రిలీజ్: జ్యోతిక ‘పొన్మగళ్ వందాల్’ తమిళ్ మూవీ రివ్యూ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

నటీనటులు: జ్యోతిక, భాగ్యరాజ్, పార్తీబన్
నిర్మాత: సూర్య
దర్శకత్వం: జేజే ఫెడ్రిక్
రన్ టైం: 2 గంటల 3 నిముషాలు
విడుదల తేదీ: మే 29, 2020
ఓటిటి ప్లాట్ ఫామ్: అమెజాన్ ప్రైమ్

తమిళ నటి జ్యోతిక నటించిన కొత్త సినిమా ‘పొన్మగళ్ వందాళ్’ ఒటీటీ ప్లాట్ ఫాంలో డైరెక్ట్ గా రిలీజైన ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్. అమెజాన్ ప్రైంలో ఈ రోజు విడుదలైంది. మే 21న ట్రైలర్ విడుదలైన దగ్గర నుండి అందరి ఆసక్తినీ తన వైపు తిప్పుకున్న ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథ:

పదిహేనేళ్ళ క్రితం ఎన్ కౌంటర్ చేయబడిన ‘సైకో జ్యోతి’ కేసును అడ్వకేట్ వెన్బ (జ్యోతిక), పిటిషన్ పేతురాజ్ (భాగ్యరాజ్) సాయంతో తిరిగి ఓపెన్ చేస్తుంది. కేసులో ఇన్వాల్వ్ అయిన వారిని తన సామర్ధ్యంతో కోర్టు ముందు సాక్ష్యాలతో ఎలా నిలబెట్టిందనేది తెలుసుకోవాలంటే సినిమా చూసి తీరాల్సిందే.

తెరమీద స్టార్స్:

ఒకవైపు చెక్కు చెదరని సకల్పంతో న్యాయం కోసం పరితపించే న్యాయవాదిగా, మరోవైపు తమ కూతురి జీవితం కోసం పరితపించే మదర్ పాత్రలో.. ఇలా రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో జ్యోతిక అద్భుతంగా నటించారు. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా ఫలితం ఎలా ఉన్నా జ్యోతిక ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటారు. తనకు ఎదురుగా వాదించే లాయర్ రాజరత్నం (పార్తీబన్) తో పోటీగా నటించారు. భాగ్యరాజ్, ప్రతాప్ పోతన్, వినోదిని, త్యాగరాజన్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.

తెర వెనుక టాలెంట్:

సంగీత దర్శకుడు గోవింద్ వసంత్ బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో పూర్తి మార్కులు కొట్టేస్తాడు. దర్శకుడిగా మరింత భవిష్యత్తు ఉండాలంటే అతను చెప్పాలనుకున్న దానిని వదిలిపెట్టకుండా సినిమాను మలచటంలో దృష్టి పెట్టాలి. నటుడు సూర్య నిర్మించిన ఈ చిత్ర నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ:

చిన్నపిల్లలపై లైంగిక ఆకృత్యాలను ముఖ్యంగా చర్చించిన ఈ సినిమాను నూతన దర్శకుడు ఫ్రెడ్రిక్ సాధారణ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లా కాకుండా కోర్టు రూమ్ డ్రామాగా మలిచిన విధానం బాగుంది. వాస్తవాలను దాచేయటానికి ప్రయత్నించే ఈర్ష్య నిండిన నేరపూరిత పురుషులు, న్యాయాన్ని మింగేసే రాబందులు, క్రూరులైన పోలీసులతో ఒక ధీరురాలైన మహిళా న్యాయవాది చేసే పోరాటాన్ని చూపటంలో కొంతమేరకే సఫలమయ్యాడు. అయితే పిల్లలపై జరిగే ఆకృత్యాలను అంత హింసాపూరితంగా చూపటం అవసరమా అనిపిస్తుంది. కొన్ని కొన్ని చోట్ల ‘ఆహా’ అనిపించిన దర్శకుడు ఆ అనుభూతిని ఎక్కువ సేపు ఉంచలేకపోయాడు. ఇంటర్వెల్ ప్లాట్, క్లైమాక్స్ ట్విస్ట్ పకడ్బందీగ రాసుకున్న దర్శకుడు ప్రతి విషయాన్ని హృదయాన్ని పిండేసే భావోద్వేగంలో నింపేయాలనే ప్రయత్నంలో లాజిక్కులకు దూరంగా కొన్ని చిక్కుప్రశ్నలను వదిలేసాడు.

తెలుగుబుల్లెటిన్ రేటింగ్: 2.5/5

సూర్య ప్రకాష్ వేద

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Ram Charan: హైదరాబాద్ లో ఘనంగా రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు..

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమానులు కలిసి చేసిన ఈ వేడుకలో మంచు మనోజ్, నిఖిల్, కిరణ్ అబ్బవరం.. నిర్మాతలు దిల్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో రాధిక శరత్ కుమార్

త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ నాలుగో జాబితా విడుదల చేసింది. 15 మందితో ఈ లిస్టు ని విడుదల చేయగా.. తమిళనాడులో 14, స్థానాలకు పుదుచ్చేరిలో...

Hyderabad: ధీర వనితలు..! పోరాడి దొంగలను పోలీసులకు పట్టించారు

Hyderabad: నాటు పిస్తోలుతో బెదిరించిన ఇద్దరు దొంగలను.. తల్లీ, కుమార్తె ధైర్యంగా ఎదుర్కొన్న ఘటన హైదరాబాద్ (Hyderabad) లో జరిగింది. ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రసూల్ పురా జైన్...