కుటుంబాల మధ్య చిచ్చుపెట్టే క్రమంలో ఓ వర్గం మీడియా, మాఫియాలా తయారవడం చాన్నాళ్ళ క్రితమే జరిగింది. మీడియా ముసుగులో రాజకీయ విద్వేషం వెదజల్లడమే ‘గ్రేట్’ పాత్రికేయం అయిపోయింది కొందరికి. మరీ ముఖ్యంగా వెబ్ మీడియాకి.!
అసలు విషయంలోకి వస్తే, జూనియర్ ఎన్టీయార్ అలాగే అల్లు అర్జున్.. ఒక్కటేనంటూ ఓ చెత్త కథనాన్ని ‘శవ పాత్రికేయం’ తెరపైకి తెచ్చింది. ఔను, ఇద్దరూ సినీ నటులే, ఇద్దరికీ పాన్ ఇండియా స్టార్‌డమ్ వచ్చింది. ఇద్దరూ కమర్షియల్‌గా ఈ మధ్యన మంచి విజయాల్ని అందుకున్నారు. ఇద్దరూ మంచి డాన్సర్లు.. ఇలా పోలిక తెస్తే తప్పు లేదు.
కానీ, నందమూరి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీయార్ వెలివేయబడితే, మెగా కాంపౌండ్ నుంచి అల్లు అర్జున్ వెలివేయబడ్డాడంటూ.. ఓ పోలిక తీసుకొచ్చింది సదరు శవ పాత్రికేయం.
ఇక్కడ జూనియర్ ఎన్టీయార్‌కీ, అల్లు అర్జున్‌కీ చాలా తేడా వుంది. నిజమే, నందమూరి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీయార్ వెలివేయబడ్డాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ నందమూరి కుటుంబంలో కలిసేందుకు జూనియర్ ఎన్టీయార్ చాలా ప్రయత్నాలు చేశాడు, చేస్తూనే వున్నాడు.
అల్లు అర్జున్ వ్యవహారం పూర్తిగా వేరు కదా.! ‘పుష్ప 2 ది రైజ్’ తర్వాత అల్లు అర్జున్ లెక్కలు మారాయి. మెగా కాంపౌండ్‌కి దూరంగా జరిగే ప్రయత్నం చేశాడు. అలాగని, పూర్తిగా మెగా కాంపౌండ్‌కి దూరమైపోలేదు. అల్లు అర్జున్‌కి కష్టమొస్తే, మొదటగా ఆ కుటుంబాన్ని పరామర్శించింది మెగాస్టార్ చిరంజీవే. ‘పుష్ప 2 ది రూల్’ ప్రమోషన్లలో ఎక్కడా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడింది అల్లు అర్జున్.
పైగా, రాజకీయంగా మెగా కాంపౌండ్‌కి వ్యతిరేకంగా అల్లు అర్జున్ నినదించాడు ఇటీవలి ఎన్నికల్లో. అయినాగానీ, అల్లు అర్జున్‌ని మెగా కాంపౌండ్ దూరం చేసుకోలేదు. అతనే దూరం జరిగిపోతున్నాడు. చిరంజీవి ఈ మధ్యన ఓ కార్యక్రమంలో ‘నా అఛీవ్‌మెంట్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్.. మీరందరూ..’ అని చెప్పారు. ఆ ‘మీరందరూ’లో అల్లు అర్జున్ కూడా వుంటాడు.
జూనియర్ ఎన్టీయార్‌ని నందమూరి కుటుంబం దూరం చేసుకుంటే, మెగా కాంపౌండ్ నుంచి దూరం జరిగేందుకు అల్లు అర్జున్ ప్రయత్నిస్తున్నాడు. అలాంటప్పుడు, అల్లు అర్జున్ – జూనియర్ ఎన్టీయార్ ఒక్కటెలా అవుతారు.?
వైఎస్ జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడే శవ పాత్రికేయం నుంచి అల్లు అర్జున్‌కి సపోర్ట్ వచ్చినా, జూనియర్ ఎన్టీయార్ తరఫున ఆ శవ పాత్రికేయం వకాల్తా పుచ్చుకున్నా.. అదంతా, మెగా కాంపౌండ్ మీద, నందమూరి కుటుంబం మీద ద్వేషం తప్ప ఇంకోటి కాదు.
మీడియా ముసుగులో ఎలాంటి రాతలైనా చెల్లిపోతాయనుకుంటే, అది హాస్యాస్పదం.! వైఎస్ జగన్ ఇంట్లో, వైఎస్ షర్మిలను ఎందుకు దూరం పెట్టినట్లు.? షర్మిల, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీయార్.. ఒకటేనని రాతలు రాయొచ్చు కదా.? రాస్తే ఇంకేమన్నా వుందా.?
కుటుంబమన్నాక చిన్నాచితకా పొరపచ్చాలు వుండొచ్చు. కొన్నిసార్లు అవి పెద్ద విభేదాలుగానూ మారొచ్చు. కానీ, కష్టమొస్తే అంతా ఒక్కటవుతారు. అంతేగానీ, చిన్న చిన్న అభిప్రాయ బేధాల్ని బూతద్దంలో చూసి, పనికిమాలిన విశ్లేషణలు చేయడమంటే, కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడమే.
అయినా, జగన్ ఇంట్లోలా కుటుంబ తగాదాల పేరు చెప్పి కోర్టుల మెట్లెక్కిన సందర్భాలైతే లేవు కదా.!