Switch to English

Jr.Ntr: ఏకాకి అవుతున్న ఎన్టీయార్.! సరైన ప్లానింగ్ ఏదీ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,384FansLike
57,764FollowersFollow

Jr.Ntr: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీయార్ నటించే కొత్త సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో ఎవరికీ తెలియదు. ‘నేనిక సినిమాలు మానేస్తా..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జూనియర్ ఎన్టీయార్.! అబ్బే, అదేం లేదు.. సరదాగా అన్నానని కూడా వివరణ ఇచ్చుకున్నాడు ఆ వెంటనే. ఇదంతా ఒక్కసారిగా అభిమానులకు షాక్ ఇచ్చింది. ‘దాస్ కా ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఎన్టీయార్ చేసిన వ్యాఖ్యలివి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీయార్ ఓ సినిమా చేయాల్సి వుంది. జాన్వీ కపూర్ హీరోయిన్. త్వరలో సినిమా పట్టాలెక్కనుంది. కానీ, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఇంత గ్యాప్ ఎందుకు వచ్చినట్లు.? ప్లానింగ్ విషయంలో ఎన్టీయార్ ఎందుకు తడబడుతున్నాడు.?

అంటే, తెరవెనుకాల యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి వెన్ను దన్నుగా వుండే పీఆర్ టీమ్ అనండీ, అత్యంత సన్నిహతులనండీ.. పూర్తిగా వెనకబడిపోయారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి ముంబైలోనూ బలమైన పీఆర్ టీమ్ ఏర్పడింది. రామ్ చరణ్ అమెరికా పర్యటనలోనూ పీఆర్ టీమ్ పెర్‌ఫెక్ట్‌గా పనిచేసింది. నిజానికి, ఎన్టీయార్‌కి కూడా పీఆర్ టీమ్ ఒకప్పుడు బలంగానే వుండేది. మెగా కాంపౌండ్‌కి వ్యతిరేకంగా పనిచేసే మీడియా మొత్తం, యంగ్ టైగర్ ఎన్టీయార్ వెంట వుంటుంది. కానీ, ఈసారి ఎందుకో లెక్కలు మారుతున్నాయి. అన్నీ ఎన్టీయార్ దగ్గరుండి చూసుకోవాలంటే కుదరదు. బ్యాక్ బోన్ ఖచ్చితంగా వుండి తీరాల్సిందే.

మహేష్‌కి నమ్రత వున్నట్లు.. రామ్ చరణ్‌కి ఉపాసన వున్నట్లు.. అనుకోవచ్చేమో!. కేవలం జీవిత భాగస్వామి అనే కాదు, పీఆర్ బృందాలు సైతం పక్కాగా పని చేయాలి. ఎక్కడో తేడా కొడుతోంది. ఎన్టీయార్ ప్రస్తావన వస్తే, రాజకీయ అంశాలూ తెరపైకొస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు సొంత సామాజిక వర్గం నుంచి.
ఎలా చూసినా, ప్లానింగ్ వైఫల్యం.. ఇంకో వైపు ఏకాకి.. అన్న తీరు.. వెరసి, ఎన్టీయార్ వెనకబడుతున్నాడు.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

విజయ్ ఆంటోని ‘ తుఫాన్’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల

"బిచ్చగాడు" సిరీస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు హీరో విజయ్ ఆంటోనీ. మరోసారి ఆయన "తుఫాన్" మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాను ఇన్ఫినిటీ...

Kalki 2898: ప్రీ-బుకింగ్స్ లో కల్కి స్పీడ్..! RRR ను దాటేసిందా..!?

Kalki 2898: ప్రభాస్ (Prabhas)-నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబోలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 28798 AD). దేశంలోనే...

Sreeleela: మళ్లీ శ్రీలీల హవా..! వరుస సినిమాలు.. బిజీ బిజీ..

Sreeleela: ఏడాది క్రితం తెలుగులో శ్రీలీల (Sreeleela) రేంజ్ చూస్తే మరో రెండు-మూడేళ్లు ఆమె కొత్త సినిమాలకు దొరకడం కష్టమనే మాట వచ్చింది. రవితేజ ధమాకాతో...

Pavithra Gowda: ‘దర్శన్ కు చెప్పి తప్పు చేశా’.. అభిమాని హత్యపై...

Pavithra Gowda: కన్నడ హీరో దర్శన్ (Darshan) అభిమాని హత్య కేసులో అరెస్టు కావడం కన్నడనాట సంచలనం రేపింది. దీనిపై హత్య కేసులో ప్రధాన నిందితురాలైన...

Sunny Leone: సన్నీ లియోన్ ఈవెంట్ కు పర్మిషన్ ఇవ్వని యూనివర్శిటీ..!

Sunny Leone: నటి సన్ని లియోని (Sunny Leone)కి కేరళ (Kerala)లోని ఓ యూనివర్శిటీ షాక్ ఇచ్చింది. ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు యూనివర్శిటీ అనుమతి నిరాకరించింది....

రాజకీయం

ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో జగన్ రాజీనామా చేయిస్తారా.?

ప్రత్యేక హోదా మళ్ళీ గుర్తుకొచ్చింది వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి. అదేంటో, అధికారంలో లేనప్పుడే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి...

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.! తర్వాతేంటి.?

‘సీఎం.. సీఎం.. అంటూ అరిస్తే సరిపోదు.. ఓట్లెయ్యండి.. ఓట్లు వేయించండి.. అభిమానులు, జనసైనికుల్లా మారండి. చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు, సీట్లు సాధించగలిగినప్పుడు.. పదవులు వాటంతట అవే వస్తాయ్..’ అని పలు సందర్భాల్లో అభిమానుల్ని...

ఇన్‌సైడ్ స్టోరీ: ఏపీ శాసనమండలిని రద్దు చేస్తారా.?

శాసన మండలి అంటే, ఖర్చు దండగ వ్యవహారమంటూ గతంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో నినదించారు. అంతే కాదు,...

జైలు నుంచి విడుదలైన నటి హేమ

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ సీనియర్ నటి హేమ శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. గత నెలలో బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో పోలీసులు ఆమెను అరెస్టు చేసిన...

డిప్యూటీ సీఎం గారి తాలూకా.. అభిమానుల కోరిక తీర్చిన పవన్ కళ్యాణ్

కొన్నాళ్ల క్రితం వచ్చిన కమ్ బ్యాక్ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) ఓ డైలాగ్ చెప్తారు. ' నేను ట్రెండ్ ఫాలో అవ్వను సెట్ చేస్తాను' అని.....

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 12 జూన్ 2024

పంచాంగం తేదీ 12- 06-2024, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ రుతువు సూర్యోదయం: ఉదయం 5:30 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:33 గంటలకు తిథి: శుక్ల షష్ఠి సా. 6.26...

Prabhas : ‘కల్కి’ ట్రైలర్‌ కి ఫ్యాన్స్‌ రియాక్షన్‌

Prabhas : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. అమితాబచ్చన్‌ తో పాటు దీపికా పదుకునే,...

Chiranjeevi: ప్రమాణ స్వీకారోత్సవానికి మెగాస్టార్.. చిరంజీవిని ఆహ్వానించిన చంద్రబాబు

Chiranjeevi: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. రేపు (జూన్ 12) గన్నవరంలోని ఐటీ పార్కుల్లో...

మోసం చేసింది వైసీపీ.! మోసపోయిన ప్రజలే ఎదురుతిరిగారు.!

‘ప్రజలే మమ్మల్ని మోసం చేశారు..’ అంటోంది వైసీపీ.! అంతలోనే, ‘ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే ఓడిపోయాం..’ అంటున్నారు కొందరు వైసీపీ నేతలు. ఏది నిజం.? ప్రజలు మోసం చేశారా.? ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా.? ఈవీఎం ట్యాంపరింగ్...

మెగా పవర్: అన్నయ్యకి తమ్ముడు ఇచ్చే గౌరవం ఇది.!

తల్లి దూరంగా వెళ్ళిపోయింది.. చెల్లెలు కంటతడి పెట్టి మరీ, అన్నకి దూరమయ్యింది.! కాదు కాదు, తల్లిని తరిమేశాడు.. చెల్లిని గోడకేసి కొట్టాడు.. ఇదీ ఓ కుటుంబంలోని అన్న అరాచకం.! ఇంకో కుటుంబం వుంది. అన్నయ్యకు...