ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన దేవర మొదటి భాగం సినిమా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో రిలీజై సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో జాన్వి హీరోయిన్ గా నటించింది. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ కూడా సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇక దేవర 1 సినిమా మార్చి 28న జపాన్ లో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.
అందుకే జపాన్ లో ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్, కొరటాల శివ జపాన్ వెళ్లారు. అక్కడ మీడియా తో ముచ్చటిస్తూ ఫ్యాన్స్ మీట్ లో కూడా పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఫ్యాన్ మీట్ లో ఎన్టీఆర్ సరదాగా ఆయుధపూజ డ్యాన్స్ వేసిన క్లిప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక దేవర 1 జపాన్ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ బిజీ బిజీగా ఉన్నాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ లుక్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. లేటెస్ట్ గా జపాన్ లో ఎన్టీఆర్ ఒక స్పెషల్ ఫోటో షూట్ నిర్వహించారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్ న్యూ లుక్ ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ అందిస్తుంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో హృతిక్ రోషన్ తో తారక్ కలిసి నటిస్తున్నాడు. వార్ 2 తో పాటు ఈమధ్యనే ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లారని తెలిసిందే.