Jr.Ntr: ‘వాళ్ల ఆశలు నెరవేరేదెప్పుడో మరి..’ ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,220FansLike
57,764FollowersFollow

Jr.Ntr: ప్రతి ఏటా తమ అభిమాన హీరో పుట్టినరోజు అభిమానులకు పండగ. తమ హీరో కొత్త సినిమా కబురు కోసం వెయిట్ చేస్తారు. హీరోకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. నిజానికి ప్రతి హీరో అభిమానుల్లోఈ హంగామా సాధారణమే. కానీ, ప్రత్యేకించి ఆ పుట్టినరోజుకి కొత్త సినిమా కబురు, స్టిల్, కొత్త సినిమా విశేషాలు తెలిస్తే ఇంకా సంతోషిస్తారు. ప్రస్తుతం ఆ హైలోనే ఉన్నారు అభిమానులు. ఆ హీరో ‘జూ.ఎన్టీఆర్’. మే 20న వాళ్లకు నిజంగానే పండగ మరి. రెండున్నర దశాబ్దాలకుపైగా అభిమానులను అలరిస్తూ వస్తున్నారు ఎన్టీఆర్. నేడు ఆయన పుట్టినరోజు. ఈసారి తన పుట్టినరోజుకి సరికొత్త హంగామాతో వచ్చారు. డ్రాగన్ గ్లింప్స్ ఇచ్చారు.

వారి అంచనాలకు తగ్గట్టే ‘డ్రాగన్’ గ్లింప్స్ వదిలారు. అభిమానులు సంతోషంలో ఉన్నారు. మరో అప్డేట్ త్రివిక్రమ్ తో సినిమా అంటున్నారు. అది కూడా వచ్చేస్తే ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. మొత్తంగా ఎన్టీఆర్ ఎప్పుడూ ఫ్యాన్స్ ని మెప్పించే విధంగా సినిమాలు చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ సినిమాలు చేసినా.. మాస్ సినిమాలు చేసినా ప్రేక్షకుల్ని అలరించడమే ఆయనకు ముఖ్యం. ఆర్ఆర్ఆర్ తో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ తో దేవర, వార్ 2 సినిమాలు చేసి నార్త్ ప్రేక్షకుల్నీ అలరించారు. ఇప్పుడు డ్రాగన్ తో మరోసారి తన మార్క్ చూపించబోతున్నారు. త్రివిక్రమ్ తో సినిమాలో డివైన్ లుక్ లో అలరించబోతున్నారని టాక్.

ప్రస్తుతం ఎన్టీఆర్ దృష్టంతా సినిమాలపైనే. కానీ, ఆయన తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ సెంటర్ పాయింటే. ఈ పొలిటికల్ పాయింట్ లో ఏదో సందర్భంలో ఫ్యాన్స్ హంగామా చేస్తారు కానీ.. ప్రస్తుతానికి ఆయన నుంచి పొలిటికల్ ఇంట్రెస్ట్ శూన్యం. కానీ, ఉన్నత హోదాలో ఎన్టీఆర్ ను చూడాలనేది కూడా ఫ్యాన్స్ కోరికే. వారి ఆకాంక్షలు మేరకు సినిమాలు చేసి సంతృప్తిపరిచే ఎన్టీఆర్.. భవిష్యత్ ప్రయాణం ఎవరికీ తెలీదు. మరి అభిమానుల ఆశలు నెరవేరతాయోలేదో కాలమే సమాధానం చెప్పాలి. మొత్తంగా హీరో ఎన్టీఆర్ తన ప్రయాణంలో మరిన్ని విజయాలు అందుకోవాలని.. సక్సెస్ ఫుల్ హీరోగా తన ప్రయాణాన్ని నిరంతరం కొనసాగించాలని మనసారా కోరుకుంటూ బర్త్ డే విషెష్ చెప్తోంది.. ‘తెలుగు బులెటిన్’

సినిమా

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్...

Rajendra Prasad: ‘ఇస్తే గౌరవం.. అడిగితే భిక్ష..’ పద్మశ్రీ అవార్డుపై రాజేంద్రప్రసాద్...

Rajendra Prasad: నవ్వులరేడుగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో ముద్ర వేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం ఇటివలే గౌరవ ‘పద్మశ్రీ’ పురస్కారం అందించిన సంగతి...

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా...

‘రావు బహదూర్’ విజయోత్సవం.. ప్రేక్షకుల ప్రేమకు సత్యదేవ్ కృతజ్ఞతలు

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన 'రావు బహదూర్' చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జూలై 3న విడుదలైన...

జూలై 9నే తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఐ, నోబడీ’.. పెయిడ్ ప్రీమియర్స్‌కు...

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ ఈ నెల 9న మలయాళంలో విడుదల కానుండగా, జూలై 10న తెలుగు ప్రేక్షకుల...

రాజకీయం

ఏపీపై కొరియా స్టార్టప్‌లకు లోకేష్ ఆహ్వానం.. లక్ష ఉద్యోగాలే లక్ష్యం

దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో కొరియన్ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌పై కీలక...

విశ్వనాథ ఆలయ మహోత్సవంలో ప్రేమ్ కుమార్ ప్రత్యేక పూజలు

హైదరాబాద్‌లోని వసంతనగర్ కాలనీలో ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి ఆలయంలో నిర్వహించిన శివాలయం పునః ప్రతిష్ట మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కూకట్‌పల్లి...

ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేనలోకి కూకట్‌పల్లి యువత చేరిక

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి యువత నుంచి మద్దతు పెరుగుతున్నట్లు మరోసారి కనిపించింది. కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కూకట్‌పల్లి డివిజన్‌కు చెందిన పలువురు...

కుప్పం టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు.. ‘జన నాయకుడు’ పోర్టల్‌పై ప్రత్యేక సమీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే లక్ష్యంతో రూపొందించిన జన నాయకుడు పోర్టల్ పనితీరును ఆయన పరిశీలించారు. పోర్టల్...

వంగవీటి రంగా జయంతి.. ఘన నివాళులు అర్పించిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్

కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఘనంగా నివాళి కార్యక్రమాలు నిర్వహించారు. బాలాజీ నగర్, ప్రగతి నగర్, ఎల్లమ్మ బండ, కేపీహెచ్‌బీ కాలనీ హౌసింగ్ బోర్డ్...

ఎక్కువ చదివినవి

ఏపీకి రూ.7,707 కోట్ల కేటాయింపు.. ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు

ఆంధ్రప్రదేశ్‌కు వికసిత్ భారత్–గారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (VB-G RAM G) కింద లభించిన భారీ నిధులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్–2047...

జనసేనలో కార్యకర్తలకే ప్రాధాన్యం.. కొత్త రాజకీయ విధానంపై పవన్ కళ్యాణ్ ఫోకస్

జనసేన పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన అవకాశం కల్పించాలన్నదే పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంకల్పమని జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల కేంద్ర కార్యాలయ సమన్వయకర్తలు...

Chiranjeevi-Rajinikanth: ‘బాక్సాఫీస్ టైటన్స్..’ మరోసారి ‘చిరంజీవి-రజినీకాంత్’ క్లాష్

Chiranjeevi-Rajinikanth: సినిమాలకెప్పుడూ మంచి సీజన్ రిలీజ్ అవసరం. అన్ సీజన్లో రిలీజై వండర్స్ క్రియేట్ చేసిన సినిమాలూ ఉన్నాయి. కానీ, సంక్రాంతి, వేసవి, దసరా, దీపావళి, క్రిస్మస్.. ఇలా పండగ సీజన్లలో సెలవులు...

తెలుగు సినిమాకు కావాల్సింది రికవరీ మోడల్ కాదు.. నమ్మకం గెలిచే బిజినెస్ మోడల్

ఒకప్పుడు సినిమా పూర్తయిన తర్వాత నిర్మాతలు, దర్శకులు, అభిమానులు ఎదురుచూసేది ఒక్కటే... "సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది?" అనే ప్రశ్న. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి...

ప్రభుత్వ పాఠశాలల్లో ‘నో అడ్మిషన్’ బోర్డులే లక్ష్యం: నారా లోకేష్

ప్రభుత్వ పాఠశాలలను నాణ్యమైన విద్యకు కేంద్రాలుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. విద్య ద్వారానే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు....