మాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు. నందమూరి ఫ్యామిలీ హీరోగా నూనూగు మీసాల వయసులోనే బాక్సాఫీస్ రికార్డులతో చెడుగుడు ఆడిన స్టార్ ఎన్టీఆర్. ఫ్యాక్షన్ కథలకు అప్పటిదాకా బాలకృష్ణ మాత్రమే బెస్ట్ అనిపించుకునే క్రమంలో ఆ ఫ్యామిలీ నట వారసుడిగా ఎన్టీఆర్ కూడా మాస్ యాక్షన్ సినిమాలకు ట్రేడ్ మార్క్ గా మారాడు. అమ్మతోడు అడ్డంగా నరికేస్తా అంటూ తారక్ డైలాగులు చెబుతుంటే మాస్ ఆడియన్స్ ఊగిపోతారు.
ఐతే ఇప్పుడు అలాంటి కథలకు కాలం చెల్లింది. ఫ్యాక్షన్ కథలతో కాకుండా వెరైటీ కథలతో స్టార్ మేనియా కొనసాగిస్తున్నాడు ఎన్టీఆర్. టాలీవుడ్ హీరోల్లో నవరసాలను పండించ గలిగే హీరో ఎన్టీఆర్. ముఖ్యంగా ఈ తరం హీరోల్లో పౌరాణిక పాత్రలను అవలీలగా చేయగలిగే సత్తా ఉన్న నటుడు ఎన్టీఆర్.
యాక్షన్ హీరోగానే కాదు డ్యాన్సింగ్ స్టార్ గా డైలాగ్ డెలివరీలో కూడా తను మాస్టర్ క్లాస్ అనిపించుకున్నాడు ఎన్టీఆర్. మాస్ హీరోగా ఉన్న తన ఇమేజ్ ని విలక్షణ నటుడిగా ఎలాంటి పాత్రలకైనా సూటయ్యే నటుడిగా మారాడు ఎన్టీఆర్. ఎంచుకున్న పాత్రకు నూటికి నూరు పాళ్లు న్యాయం చేస్తూ అభిమానులను మెచ్చే హీరోగా రికార్డుల రారాజుగా ఎన్టీఆర్ మాస్ విధ్వంసం బాక్సాఫీస్ సునామీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు.
RRR తో ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని కూడా అలరించిన తారక్ ప్రస్తుతం వార్ 2, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. రాబోతున్న సినిమాలతో మరోసారి బాక్సాఫీస్ పై తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు ఎన్టీఆర్. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న ఎన్టీఆర్ కు ప్రత్యేకమైన బర్త్ డే విషెస్ అందిస్తుంది telugubulletin.com టీమ్.
