యంగ్ టైగర్ ఎన్టీఆర్ – యాక్షన్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘ఎన్టీఆర్ 30’ పేరుతో ప్రచారంలో ఉంది. ఈ సినిమా పూజా కార్యక్రమం ఈనెల 23న జరగనుంది. అయితే దీనికి సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారనేది దీని సారాంశం.
ఆయనతో పాటు దర్శక ధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరుకానున్నారట. బాలీవుడ్ స్టార్ హీరోయిన్, దివంగత నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా చేస్తోంది. జాన్వీ కోసమైనా చిరంజీవి అతిథిగా వస్తారని టాక్ వినిపిస్తోంది. గతేడాది చిరు-కొరటాల కాంబినేషన్ లో వచ్చిన ‘ఆచార్య’ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ‘ఎన్టీఆర్ 30’ తో తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి రావాలని కోవాలని కొరటాల భావిస్తున్నారు.
సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోయే ఈ చిత్రం కోసం.. హైదరాబాద్ లో సముద్రం, ఓ దీవి సెట్ ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఇందులో విలన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కనిపిస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.
888696 157119Thanks for helping out, superb information . 668996