99 టీవీకి చెందిన జర్నలిస్టు పత్రి వాసుదేవన్ వార్తా విశ్లేషణ పేరుతో ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తూ వివాదంలో చిక్కుకున్నారు. అమెరికా నుంచి 200 మంది షార్ప్ షూటర్లు వచ్చారంటూ, జగన్ భద్రతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ వాస్తవానికి దూరమైన విశ్లేషణలు చేశారు. తన వద్ద ఇంటెలిజెన్స్ నివేదిక ఉందంటూ కూడా అతిశయోక్తి వ్యాఖ్యలు చేశారు.
ఈ విష ప్రచారం వర్గాల మధ్య ఉద్రిక్తతలు సృష్టించే అవకాశం ఉందని పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలని 41-ఏ నోటీసులు జారీ చేయగా, భయంతో పత్రి వాసుదేవన్ పరారయ్యారు.
ఈ నేపథ్యంలో 99 టీవీ యాజమాన్యం అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది. ఛానల్ విశ్వసనీయతే ముఖ్యం కాబట్టి వ్యక్తిగత అభిప్రాయాలకు వేదిక ఇవ్వబోమని స్పష్టం చేసింది.
పత్రి గతంలో చేసిన వీడియోలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇలాంటి విష ప్రచారాలకు చట్టబద్ధంగా చెక్ పెట్టాలని పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు.
