AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ‘అమరావతి’ ప్రాంతంపై విషం కక్కుతూ నీచపు మాటలు మాట్లాడిన జర్నలిస్టు కృష్ణంరాజు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఇటివల సాక్షి టీవీ చానెల్ వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్ లో ఆయన మాట్లాడుతూ.. ‘అమరావతి దేవతల రాజధాని కాదు.. వేశ్యల రాజధాని’ అంటూ దారుణ పదజాలం ఉపయోగించిన సంగతి తెలిసిందే.
ఆయన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు, నిరసనలు చెలరేగాయి.. ఆయనపై కేసులు నమోదయ్యాయి. దీంతో భయభ్రాంతులకు గురైన కృష్ణంరాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మూడు రోజులుగా పరారీలో ఉన్న కృష్ణంరాజు పలు వీడియోలు విడుదల చుస్తూ తప్పించుకుంటున్నారు. ఎట్టకేలకు ఆయన పోలీసులకు చిక్కాడు. బుధవారం రాత్రి భీమిలీ గోస్తనీ నది సమీపంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
సమీపంలోని సెల్ టవర్ ఆధారంగా ఆయన ఉన్న లోకేషన్ గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతోపాటు ఉన్న మరో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని విశాఖపట్నం నుంచి విజయవాడకు తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. కృష్ణంరాజు ‘జర్నలిస్ట్’ మ్యాగజైన్ ఎడిటర్.
