Switch to English

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఈ ‘కుక్కల’ గోలేంటి.?

రాజకీయాల్లో విలువలు ఎప్పుడో దిగజారిపోయాయి.. దిగజారిపోయిన ఆ విలువల వలువలూడ్చేయడానికి ఇంకా ఇంకా ప్రయత్నిస్తూనే వున్నారు నేటి తరం రాజకీయ నాయకులు. పదవుల కోసం నేతలు కక్కుర్తి పడటం కొత్తేమీ కానీ, ఆ కక్కుర్తి మరింత హీనమైన స్థాయికి దిగజారిపోతుండడం అత్యంత బాధాకరమైన విషయం. ఈ మధ్యనే ఓ టీడీపీ మహిళా నేత, తమ అధినేతను ఉద్దేశించి ‘మంచి కుక్క – చెడు కుక్క’ అంటూ ప్రస్తావించారు. అధినేతను వెనకేసుకొచ్చేందుకే అయినా, ఆమె చేసిన వ్యాఖ్యలు అందర్నీ విస్మయానికి గురిచేశాయి. టీడీపీ శ్రేణులు సైతం, ఆ వ్యాఖ్యల్ని జీర్ణించుకోలేకపోయాయి.

తాజాగా వైపీపీ నేత ఒకరు, జనసేన అధినేతపై అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. ‘మీకు పీకే అంటే పవన్‌ కళ్యాణ్‌ కావొచ్చు.. మాకు మాత్రం పీకే అంటే పిచ్చికుక్క..’ అంటూ నోరు పారేసుకున్నారాయన. ఆయనెవరో కాదు, జోగి రమేష్‌. మొన్నామధ్య తూర్పుగోదావరి జిల్లాకి చెందిన ఓ వైసీపీ నేత, పవన్‌ కళ్యాణ్‌పైనా.. చంద్రబాబుపైనా రాయడానికి వీల్లేని పదజాలం ఉపయోగించారు. నిజానికి, ఇలాంటి తిట్లు ఏ ఒక్కరికో సొంతం కాదు. కానీ, అలా తిట్టడం వల్ల ఏం ప్రయోజనం.? ఏ వ్యక్తి అయినా నోరు పారేసుకుంటే, అవతలి వ్యక్తి గౌరవం తగ్గిపోదు.. ఎవరైతే నోరు పారేసుకుంటారో, వారే తమ స్థాయిని దిగజార్చుకున్నవారవుతారు. అంతే మరి.!

ఇంటకెళ్ళి తన భార్య దగ్గరో, కుమార్తె దగ్గరో, ఇతర కుటుంబ సభ్యుల దగ్గరో ‘నేను భలేగా మాట్లాడేశాను కదా..’ అని చెప్పుకోగలరా.? దురదృష్టవశాత్తూ ఈ తరహా రాజకీయ నాయకుల నుంచి విజ్ఞత ఆశించలేం. ప్రత్యర్థుల్ని నోటొకిచ్చినట్లు తిడితే, బిస్కెట్లు.. అదేనండీ పదవులో, గుర్తింపో దక్కుతుందని భావిస్తారేమో.!

ఈ రోజు ఈ పార్టీలో వున్నారు.. అవతలి వ్యక్తిని తిడుతున్నారు సరే.. రేప్పొద్దున్న పార్టీ మారితేనో.! చూస్తున్నాం కదా, వల్లభనేని వంశీ గతంలో ఎలా మాట్లాడారో, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో.! ఒక్కటి మాత్రం నిజం.. రాజకీయ నాయకులు తమ రాజకీయ విమర్శల కోసం ‘జంతువుల’ ప్రస్తావన తీసుకురాకపోతే మంచిది. ఎందుకంటే, ఆ జంతువులు కూడా సిగ్గుపడేలా తయారైంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

హ్యాపీ లేని నెస్ట్ మాకెందుకు?

ఏపీ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ నిర్మించి ఇచ్చే హ్యాపీ నెస్ట్ ఫ్లాట్లపై కొనుగోలుదారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో నివాసం ఉండాలనే ఉద్దేశంతో తాము అందులో ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపించామని,...

కరోనా అలర్ట్‌: మారటోరియం.. మళ్ళీ వచ్చిందిగానీ..

కరోనా వైరస్‌ దెబ్బకి ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది. ఈ నేపథ్యంలో లోన్లు తీసుకున్నవారికి కాస్త ఉపశమనం కల్పించేలా ఆర్బీఐ గతంలోనే మూడు నెలల మారటోరియం ప్రకటించిన విషయం విదితమే. ఈ నెలాఖరుతో ఈ...

ఇన్‌సైడ్‌ స్టోరీ: ‘బాబు’లిద్దరూ హైద్రాబాద్‌లో ఇంకెన్నాళ్ళు.!

సోషల్‌ మీడియాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అనుకూలంగా, వ్యతిరేకంగా వేలాది, లక్షలాది పోస్ట్‌లు నిత్యం దర్శనమిస్తున్నాయి. వీటిల్లో మెజార్టీ పోస్ట్‌లు చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు గత కొన్నాళ్ళుగా హైద్రాబాద్‌కే పరిమితమవడంపై...

జ‘గన్‌’ ‘ 151: ఆ ఘనతకు ఏడాది.!

సరిగ్గా ఏడాది క్రితం.. ఇదే రోజున వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయ ఢంకా మోగించింది. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ల్యాండ్‌ స్లైడ్‌ విక్టరీని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సొంతం చేసుకుంది....

క్రైమ్ న్యూస్: అంకుల్‌తో కలిసి అమ్మే నాన్నను చంపేసిందని చెప్పిన 12 ఏళ్ల బాలుడు

అక్రమ సంబంధాలు ఎంతటి దారుణంకు ఒడిగట్టేందుకు అయినా ఉసిగొల్పుతాయని మరోసారి నిరూపితం అయ్యింది. హైదరాబాద్‌ లాలా పేటకు చెందిన నాగభూషణం ఇటీవల మృతి చెందాడు. ఆయన గుండె పోటుతో మృతి చెందినట్లుగా భావించి...