Switch to English

అద్భుతః చంద్రబాబుపై జోగి రమేష్ అండ్ టీమ్ హత్యాయత్నమట.!

రాజకీయాల్లో విమర్శలు సహజం. ఈ మధ్య రాజకీయాల్లో బూతులు సర్వసాధారణమైపోయాయి. మంత్రి కొడాలి నాని, టీడీపీ అధినేత చంద్రబాబుని బూతులు తిడుతున్నారు.. అలాగని, టీడీపీ నేతలు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటి మీదకు దాడికి వెళ్ళారా.? ఇకపై వెళ్ళక తప్పదేమో.. అన్న చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోంది.

ఎందుకంటే, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద అవాకులు చెవాకులు పేలారంటే, వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద ధర్నాకి దిగారు. అసలు రాష్ట్రంలో కరోనా ఆంక్షలు వుంటే, వైసీపీ నేతలు ఎలా ఈ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారట.?

నారా లోకేష్, గుంటూరు జిల్లా నర్సరావుపేట వెళ్ళేందుకు కొన్నాళ్ళ క్రితం సమాయత్తమైతే, ‘కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో మీ పర్యటనకు అనుమతి లేదు..’ అంటూ లోకేష్‌కి తేల్చి చెప్పిన పోలీసులు, చిత్రంగా జోగి రమేష్.. ఏకంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి ముందు ధర్నాకి దిగేంత వరకు సైలెంటుగా వున్నారు. దీన్నే టీడీపీ భాషలో అయితే, ‘రాజారెడ్డి రాజ్యాంగం’ అంటాన్నది తెలుగు తమ్ముళ్ళ వాదన.

చంద్రబాబు మీద హత్యాయత్నమంటూ జోగి రమేష్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇరు పక్షాల మధ్య కాస్సేపు యుద్ధ వాతావరణం నెలకొంది. రాళ్ళ దాడి.. కర్రలతో దాడి.. అహో.. రణరంగమైపోయిందక్కడ. ఎలాగైతేనేం, పోలీసులు చివరికి పరిస్తితిని అదుపులోకి తెచ్చారు. అసలంటూ, ఈ పరిస్థితి రావడానికి కారణం పోలీసు వైఫల్యం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

శాంతియుత ధర్నా చేయడానికి తాము వెళితే, టీడీపీ నేతలే దాడికి దిగారనీ, చంద్రబాబు కనుసన్నల్లోనే ఈ దాడి జరిగిందనీ జోగి రమేష్ గుస్సా అవుతున్నారు. చంద్రబాబుని అరెస్ట్ చేయాలన్నది జోగి రమేష్ డిమాండ్. మొత్తానికి, రాష్ట్రంలో అత్యద్భుతమైన పాలన నడుస్తోంది.

అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత ఇంటిపై దాడికి అనుచరులతో కలిసి వెళ్ళడమేంటి.? అన్న విమర్శ టీడీపీ నుంచి వినిపిస్తున్న దరిమిలా.. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసు శాఖ ఎలా స్పందిస్తుంది.? ఇలాంటి ధర్నాల్ని విపక్షాలు కూడా, ముఖ్యమంత్రి ఇంటి వద్ద చేయడానికి ఏపీ పోలీస్ అనుమతిస్తుందా.? వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘అయ్యగారు’ ఫ్యాన్‌ ను కలుస్తాడట

అఖిల్ అక్కినేనికి అభిమానులు ముద్దుగా పెట్టుకున్న పేరు అక్కినేని ప్రిన్స్. కాని అఖిల్‌ దాని కంటే కూడా అయ్యగారు బిరుదుకు ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నాడు. సోషల్...

కోట అంత నీచంగా మాట్లాడటం బాధించింది : అనసూయ

జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ ఈమద్య కాలంలో బుల్లి తెర మరియు వెండి తెరపై తెగ బిజీ అయ్యింది. ఆమె ఎంత బిజీ అవుతుందో అంతకు మించిన...

సామ్‌ బాలీవుడ్‌లో డబుల్ ధమాకా

విడాకుల నిర్ణయం తర్వాత సమంత సినిమాల పరంగా జోరు పెంచినట్లుగా అనిపిస్తుంది. పెద్ద ఎత్తున సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లు చేయాలనే ఉద్దేశ్యంతో ఈ...

బిగ్ బాస్ 5: ప్రియా వల్ల సన్నీ ప్రవోక్ అయిపోయాడా? –...

బిగ్ బాస్ సీజన్ 5 లో ఈసారి నామినేషన్స్ చాలా కొత్త పంథాలో జరిగాయి. ముందుగా కంటెస్టెంట్స్ లో ముగ్గురు వేటగాళ్లు ఉంటారు. వారు జస్వంత్,...

‘మా’ బైలాస్ మారుస్తాం.. వారిద్దరి రాజీనామాలు ఆమోదించట్లేదు: మంచు విష్ణు

‘మా’ అసోసియేషన్ బైలాస్ ను మారుస్తామని.. నాగబాబు, ప్రకాశ్ రాజ్ చేసిన రాజీనామాలను ఆమోదించట్లేదని మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. సోమవారం ఉదయం...

రాజకీయం

ఆంధ్రప్రదేశ్ రాజకీయ విధ్వంసం: ఈ పాపం ఎవరిది.?

ప్రతిపక్ష నేత ఇంటి మీదకు అధికార పార్టీ ఎమ్మెల్యే, తన అనుచరులతో కలిసి వెళితే, ‘అబ్బే, అది దాడి కాదు.. వినతి పత్రం ఇచ్చేందుకు చేపట్టిన కార్యక్రమం..’ అంటూ చిత్ర విచిత్రమైన వివరణలు.....

పచ్చ పైశాచికానందం.. అందుకే జనసేనపై దుష్ప్రచారం.!

తాను నాశనమైపోతూ, ఇతరుల్ని నాశనం చేయడం ద్వారా పైశాచికానందం పొందుతుంటారు కొందరు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిది భస్మాసురహస్తం.. అనేది ఇందుకే. ఏ పార్టీతో అంట కాగితే ఆ పార్టీని నాశనం చేయడం...

షర్మిల ప్రజా ప్రస్థానం 400 రోజులు.. 4 వేల కి.మీ

వైఎస్సార్‌ రాజకీయ వారసురాలిగా షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టారు. ఆమె అతి త్వరలోనే ప్రజల్లో మంచి పేరు దక్కించుకోవడం కోసం పాదయాత్రను మార్గంగా ఎంచుకున్నారు. అందుకోసం ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను...

వైఎస్ షర్మిల పాదయాత్ర.. అన్నతో పోల్చితే కాస్త డిఫరెంట్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేశారు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో.. అది రాజకీయ సంకల్ప యాత్ర.. అధికారం కోసం చేపట్టిన సంకల్ప యాత్ర.....

‘మా’ లొల్లి అమెరికా కూడా వెళ్లొచ్చేయ్ ఓ పాలి..

ఎన్నికలు అయిపోయాయ్. ఇకపై మేమంతా ఒక్కటే.. అని ‘మా’ కొత్త అధ్యక్షడు మంచు విష్ణు చెప్పాడు. చెప్పాకా మాట మీద నిలబడాలా.? వద్దా.? ‘మా’ ప్యానెల్ నుంచి ఇకపై ఎవరూ మీడియా ముందుకొచ్చి...

ఎక్కువ చదివినవి

కరోనాను జయించిన జపాన్‌

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఆందోళన కొనసాగుతూనే ఉంది. 2023 వరకు కరోనా భయంతో ప్రపంచం బిక్కు బిక్కుమనాల్సిందే అంటూ ప్రతి ఒక్కరు ఆందోళన చెందుతున్న సమయంలో జపాన్ మాత్రం తాము కరోనాను జయించినట్లుగా...

విజయ్ తో అల్లు అర్జున్ చిత్ర సీక్వెల్ ను ప్లాన్ చేస్తోన్న సుకుమార్

దర్శకుడు సుకుమార్ ఆలోచనలు కొత్తగా ఉంటాయి. కథ రొటీన్ దే అయినా కూడా స్క్రీన్ ప్లే విషయంలో మ్యాజిక్ చేయడం సుకుమార్ ప్రత్యేకత. తన తొలి చిత్రం ఆర్యలో వన్ సైడ్ లవ్...

సామ్‌ బాలీవుడ్‌లో డబుల్ ధమాకా

విడాకుల నిర్ణయం తర్వాత సమంత సినిమాల పరంగా జోరు పెంచినట్లుగా అనిపిస్తుంది. పెద్ద ఎత్తున సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లు చేయాలనే ఉద్దేశ్యంతో ఈ అమ్మడు ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి....

మెగా కాంపౌండ్ లో ప్రశాంత్ నీల్..! రామ్ చరణ్ తో సినిమా..!!

కేజీఎఫ్ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్ దేశవ్యాప్త క్రేజ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేజీఎఫ్-2, ప్రభాస్ తో సలార్ తెరకెక్కిస్తున్నారు. తర్వాత ఎన్టీఆర్, అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాల్సి...

ఆంధ్రప్రదేశ్‌లో సినిమాకి పొలిటికల్ కష్టాలు తీరినట్టేనా.?

ఎట్టకేలకు ఓ ఊరట తెలుగు సినిమాకి. థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న దరిమిలా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం...