రైల్వేలో ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రకటన ద్వారా Grade-3 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మార్చిలో గ్రేడ్-1, గ్రేడ్- 3 టెక్నీషియన్ విభాగంలో 9,144 ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. వాటిని 14,298 కి పెంచుతూ మరో నోటిఫికేషన్ విడుదలైంది. కొత్తగా చేర్చిన 5,154 ఉద్యోగాలు గ్రేడ్-3 లోనే ఉన్నాయి. దీంతో ఈ విభాగంలో పోస్టుల సంఖ్య 13,206 కు పెరిగింది. పదో తరగతి తర్వాత నిర్దేశత విభాగాల్లో ఐటిఐ పూర్తి చేసుకున్న వారు గ్రేడ్-3 పోస్టులకు పోటీ పడవచ్చు. గతంలో దరఖాస్తు చేసుకోని వారికి ఇప్పుడు అవకాశం ఇచ్చారు. అలాగే గతంలో అప్లై చేసిన అభ్యర్థులు ఏవైనా మార్పులు ఉంటే ఇప్పుడు చేసుకోవచ్చు.
ముఖ్య వివరాలు:
* గ్రేడ్ 3 టెక్నీషియన్ పోస్టులు పాతవి 8,052, కొత్తగా చేర్చినవి 5154 తో కలిపి 13,206 పోస్టులు. కొత్తగా ప్రకటించిన పోస్టులన్నీ రైల్వే వర్క్ షాప్ లు, ప్రొడక్షన్ యూనిట్లకు చెందినవి. ఈ పోస్టులన్నింటినీ 22 విభాగాల్లో భర్తీ చేస్తారు.
* పదో తరగతి తర్వాత సంబంధిత విభాగాల్లో ఐటిఐ చేసిన వారు, కొన్ని ఉద్యోగాలకు పదో తరగతి తర్వాత అప్రెంటిస్ షిప్ పూర్తి చేసుకున్నవారు అర్హులే. వీటిలో టెలికమ్యూనికేషన్ విభాగాలకు ఇంటర్లో ఎంపీసీ చదివిన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.
* జూలై 1, 2024 నాటికి 18-33 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ,ఎస్టీలకు ఐదేళ్లు, ఓబిసి లకు మూడేళ్లు, దివ్యాంగులకు కేటగిరీ ప్రకారం 10 నుంచి 15 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.
* మహిళలు, ఎస్సీ, ఎస్టీ ట్రాన్స్ జెండర్, ఈబీసీలు రూ. 250 దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాలి. ఇతర వర్గాల వారికి ఫీజు రూ. 500. వీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కి హాజరైతే బ్యాంకు చార్జీలు మినహాయించి మిగిలిన రుసుము వెనక్కి ఇస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 16. పరీక్షలు డిసెంబర్ 11 నుంచి 26 వరకు నిర్వహిస్తారు.
మరిన్ని వివరాలను https://rrbsecunderabad.gov.in/ వెబ్ సైట్ లో చూడొచ్చు.