అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాహ్నవి స్లో అండ్ స్టడీ గా తన క్రేజ్ ని రోజా రోజు కు పెంచుకునే పనిలో పడింది. అయితే తాజాగా ఈ అమ్మడు తన తల్లి తరహాలోనే ఓ క్రేజీ అవకాశానికి నో చెప్పడం అందరికి షాకిచ్చింది. ఇంతకి ఏమిటా క్రేజీ ఆఫర్ అంటే .. బాహుబలి లాంటి సంచలన చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు రాజమౌళి. ఈ సినిమా తరువాత అయన ఎన్టీఆర్ – చరణ్ లతో ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇప్పటికే బాలీవూడ్ హీరోయిన్ అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండగా, మరో హీరోయిన్ పాత్రకోసం ఇప్పటికే అన్వేషణ సాగిస్తున్న జక్కన ఆ పాత్రకోసం జాహ్నవికి అఫర్ ఇచ్చాడట. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా ఈ పాత్ర చేయాలనీ చెప్పాడట.
అయితే ఈ సినిమా విషయంలో జాహ్నవి అంతగా ఆసక్తి చూపించడం లేదన్నది బాలీవుడ్ మీడియా వర్గాల్లో చర్చ నడుస్తుంది. నిజంగా సౌత్ సినిమాల్లోకి ఇది జాహ్నవికి మంచి ఎంట్రీ .. అలాంటిది జాహ్నవి ఈ అఫర్ పై ఎందుకు ఆసక్తి చూపించడం లేదన్నది ఎవ్వరికి అర్థం కానీ ప్రశ్న !! రాజమౌళి సినిమాలో అవకాశం రావడం అంటే .. నటీనటులకు పండగ లాంటిది .. ఎందుకంటే నటించే అవకాశం అక్కడే ఉంటుంది. మరి ఈ విషయంలో జాహ్నవి ఎందుకు ఆసక్తి చూపించడం లేదో మరి.
ఇంతకు ముందే బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్రకోసం శ్రీదేవిని అడిగాడట రాజమౌళి .. ఆ పాత్ర కోసం ఎక్కువ రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసిందట శ్రీదేవి .. దాంతో ఆ పాత్రను రమ్యకృష్ణ తో చేయించి.. రమ్యకృష్ణ లైఫ్ కు టర్నింగ్ పాయింట్ ఇచ్చాడు. ఆ సినిమా చూసాకా శ్రీదేవి కూడా ఏమి మిస్ అయ్యిందో తెలుసుకుంది. అయినా ఇలాంటి మంచి అవకాశం ఊరికే రాదు .. ఇప్పుడు శ్రీదేవి కూతురు జాహ్నవి కూడా తల్లి తరహాలోనే రాజమౌళి ఆఫర్ ని కాదంటుందంటే .. ఆమె కెరీర్ లో మంచి అవకాశం పోగొట్టుకున్నట్టే అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో శ్రీదేవి విషయంలో రాజమౌళి చేసిన వాఖ్యల నేపథ్యంలోనే జాహ్నవి ఈ సినిమాకు నో చెప్పిందేమో అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.