మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆపేసిన ఈ సినిమా దాదాపు 70% షూటింగ్ పూర్తి చేసుకుంది. జూన్ నుంచి సినిమా షూటింగ్స్ కి పర్మిషన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుండడంతో త్వరలోనే తక్కువ మందితో షూట్ మొదలు పెట్టడానికి రాజమౌళి ప్లాన్ సిద్ధం చేశారు. ఈ సినిమా కాకుండా రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లో కలిసి నటిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ తారుమారవడంతో ఈ రెండిటిలో ఏది ముందు రిలీజ్ అవుతుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది.
ఈ సినిమాల తర్వాత రామ్ చరణ్ ఎవరితో సినిమా చేస్తారు అనే విషయంపై చాలా రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా కొందరు ‘మళ్ళీ రావా’, ‘జెర్సీ’ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో రామ్ చరణ్ సినిమా ఉంటుందని, దానికి అన్నీ సిద్దమయ్యాయనే వార్తలు ప్రచారంలోకి తెచ్చారు. ఈ సినిమా గురించి మేము తెలుసుకున్న సమాచారం ప్రకారం వీరి కాంబోలో అప్పుడప్పుడే మూవీ ఉండదు.
గౌతమ్ ఐడియాస్ మరియు టాలెంట్ రామ్ చరణ్ ని ఇంప్రెస్ చేసిన మాట వాస్తవమే కానీ వీరిద్దరి కాంబినేషన్ లో మూవీకి చాలా టైం పడుతుందని, దాని గురించి ఇప్పుడు మాట్లాడేది కాదని ఆ వార్తని కొట్టిపారేశారు గౌతమ్ సన్నిహితులు. సో ఈ కాంబినేషన్ లో మూవీ ఉండచ్చు కానీ ఇప్పుడు కాదు అనేది ఖరారైంది. కానీ ఈ కాంబినేషన్ ని మాత్రం అభిమానులు చూడాలనుకుంటున్నారు.
979082 712134Wohh exactly what I was searching for, appreciate it for posting . 406651