సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్యపాత్రలో ఆయన కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. లైకా ప్రొడక్షన్స్, రెడ్ గెయింగ్ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ‘లాల్ సలామ్’. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ ఆసక్తి రేపుతోంది.
ఒకప్పటి హీరోయిన్, తెలుగు నటి జీవిత రాజశేఖర్ ఈ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇందుకు సంబంధించి చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. మార్చి 7నుంచి చెన్నైలో జరిగే షెడ్యూల్లో ఆమె పాల్గొనబోతున్నారు. జీవిత రాజశేఖర్ ప్రస్తుతం నటిగా విరామం తీసుకున్నారు. అడపాదడపా భర్త రాజశేఖర్ తో సినిమాలు నిర్మిస్తూ తెరకెక్కిస్తున్నారు. ఈనేపథ్యంలో జీవిత మళ్లీ మేకప్ వేసుకోడం ఆసక్తి రేపుతోంది. సినిమాలో రజినీకాంత్ కు చెల్లెలు పాత్రలో జీవిత నటిస్తున్నారని సమాచారం. ఐశ్వర్యకు దర్శకురాలిగా ఇది మూడో సినిమా.