Switch to English

సిల్లీ రీజన్‌ కాదు, సీరియస్‌: జనసేనను వీడటంపై జేడీ!

‘‘జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా నన్ను ఆ పార్టీలోకి ఆహ్వానించారు. ఫుల్‌ టైమ్ రాజకీయాలు చేయాలనే ఉద్యోగం వదులుకుని రాజకీయాల్లోకి రావడం జరిగింది. అయితే, జనసేన అధినేత.. అనూహ్యంగా మళ్ళీ సినిమాల్లో నటించాలనుకున్నారు. అందుకే, ఆయనతో విబేదించి పార్టీ నుంచి బయటకు వచ్చాను..’’ అంటూ మరో మారు మనసులో మాట బయపెట్టారు జనసేన మాజీ నేత, సీబీఐ మాజీ జేడీ వివి లక్ష్మినారాయణ.

అయితే, జనసేన పార్టీని నడపడానికి, తన కుటుంబం నడవడానికి, తనను నమ్ముకున్నవారి కుటుంబాలు నడవడానికి అవసరమైన మేర సంపాదన తప్పనిసరి అనీ.. అందుకే తాను సినిమాల్ని ఎంచుకున్నానని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

సినిమాలకు పూర్తిగా గుడ్‌ బై చెప్పినా.. ప్రత్యేక పరిస్థితులు పవన్‌ని మళ్ళీ సినిమాల వైపు మళ్ళించాయి. సినిమాల్లో ఓ వైపు నటిస్తూ, ఇంకో వైపు పార్టీ కార్యకలాపాలు చూసుకుంటూ జనసేన అధినేత పడుతున్న కష్టమేంటో అటు పార్టీ శ్రేణులకీ తెలుసు, ఇటు పవన్‌ కళ్యాణ్‌తో సినిమాలు చేస్తోన్న దర్శక నిర్మాతలకీ తెలుసు. అందుకే, జెడి లక్ష్మినారాయణ నిర్ణయాన్ని చాలామంది ‘సిల్లీ డెసిషన్‌’గా కొట్టిపారేస్తున్నారు.

అయితే, జెడి లక్ష్మినారాయణ మాత్రం తనది సీరియస్‌ డెసిషన్‌ అంటున్నారు. ‘చాలా ఆలోచించే ఆ నిర్ణయం తీసుకున్నాను’ అని చెబుతున్నారాయన. ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌, ‘నేను దాన్ని సిల్లీ రీజన్‌ అని అనలేనుగానీ..’ అంటూనే, జెడి లక్ష్మినారాయణ ముందే సెటైర్‌ వేసేశారు. దాంతో, కొంత అసహనానికి గురైనట్లు కన్పించిన లక్ష్మినారాయణ, ఆ విషయమై సరైన రీతిలో వివరణ ఇవ్వలేకపోవడం గమనార్హం.

ఇక, బీజేపీ వైపుగా లక్ష్మినారాయణ అడుగులు పడుతున్నట్లుగా గత కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతోన్న విషయం విదితమే. ఈ తరహా స్పెక్యులేషన్స్‌కి అవకాశమివ్వడం లక్ష్మినారాయణకు కొత్తేమీ కాదు. ‘నిప్పు లేకుండా పొగ రాదు కదా..’ అని ప్రశ్నిస్తే, ‘నిప్పు మీరే పుట్టిస్తారు.. పొగ కూడా మీరే తీసుకొస్తారు..’ అంటూ మీడియాపై తనదైన స్టయిల్లో సెటైర్లు వేశారు.

మరోపక్క, లక్ష్మినారాయణ వైసీపీ వైపు వెళతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ‘ప్రస్తుతానికి ప్రజలతోనే వున్నాను.. ఏ పార్టీలో చేరాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదు.. ముఖ్యమంత్రి పదవి వస్తే.. అదొక బాధ్యతగా భావిస్తాను’ అని లక్ష్మినారాయణ తన తాజా ఇంటర్వ్యూలో మనసులోని మాటను బయటపెట్టారు.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

బ్రేకింగ్ న్యూస్: 12 గంటల్లో ఢిల్లీలో రెండు భారీ అగ్ని ప్రమాదాలు.!

సోమవారం అర్ధరాత్రి 12 గంటల 50 నిమిషాలకి ఢిల్లీలోని తుగ్లకాబాద్‌ మురికివాడలో మంటలు చెలరేగాయి.ఈ మంటలు సుమారు రెండు ఎకరాల మేర వ్యాపించడంతో అక్కడున్న దాదాపు 1500 గుడిసెలు ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాదం...

ఇన్‌సైడ్‌ స్టోరీ: చిరంజీవిపైకి బాలయ్యను ఎగదోస్తున్నదెవరు.?

మెగాస్టార్‌ చిరంజీవి నేతృత్వంలో కరోనా క్రైసిస్‌ ఛారిటీ సినీ పరిశ్రమలో లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయినవారికి సాయం చేసేందుకోసం ఏర్పాటయిన విషయం విదితమే. పలువురు సినీ ప్రముఖులు ఈ బృహత్‌ కార్యక్రమానికి చిరంజీవి...

వైఎస్‌ జగన్‌ పాలనకు ఏడాది: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏదీ.?

‘మేం అధికారంలోకి వస్తే, కేంద్రం మెడలు వంచి ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధిస్తాం..’ అని 2014 నుంచి 2019 వరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నినదించింది. 2014 ఎన్నికల్లోనూ ఈ ప్రత్యేక హోదా...

వ్యభిచార కేంద్రంలో పట్టుబడ్డ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌

నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన ఒక ఉన్నతాధికారి అత్యంత నీచంగా తన స్థాయిని మర్చి పోయి తుచ్చమైన శృంగార కోర్కెలను తీర్చుకోవడానికి వ్యభిచార గృహంకు వెళ్లాడు. ముంబయి నుండి హైదరాబాద్‌ కు ప్రత్యేకంగా ఇందుకోసమే...

బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చూసాక స్పందిస్తా: మంత్రి తలసాని

సినీ పరిశ్రమ గురించి ప్రముఖులతో జరిగిన చర్చలపై బాలకృష్ణ వ్యాఖ్యలను చూశాక స్పందిస్తానని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. షూటింగ్స్ పునఃప్రారంభించే విషయమై సినిమా, టీవీ...