దశావతారం .. జాతీయ నటుడు కమల్ హాసన్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో ఏకంగా పది పాత్రలతో సంచలనం క్రియేట్ చేసాడు కమల్ హాసన్. ఇలా ఒకే నటుడు ఒకే సినిమాలో పది పాత్రలు వేయడం అన్నది ప్రపంచ సినిమా చరిత్రలోనే రికార్డు. ఇది మొన్నటి సంగతి .. కానీ అప్పట్లో అంటే 70 వ దశకంలోనే మహా నటుడు అక్కినేని నాగేశ్వర రావు ఏకంగా తొమ్మిది పాత్రలు వేసి అందరికి షాకిచ్చాడు. అదే నవరాత్రి సినిమా. ఒకే సినిమాలో తొమ్మిదిమంది ఏఎన్ఆర్ లను చుసిన జనాలు షాక్ అయ్యారట ఆ రోజుల్లో.
సరిగ్గా ఇప్పుడు అలాంటి ప్రయోగమే మరో తమిళ హీరో చేస్తున్నాడు. ఈ సినిమాలో ఏకంగా తొమ్మిది గెటప్స్ లో ఈ హీరో కనిపిస్తాడట. ఇంతకీ ఎవరా హీరో ? ఏమా కథ అంటే .. తమిళంలో వరుస విజయాలతో జోరుమీదున్న జయం రవి హీరోగా నటిస్తున్న తదుపరి చిత్రంలో అయన 9 గెటప్స్ లో కనిపిస్తాడట. ప్రదీప్ రంగనాథ్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా పూర్తిస్థాయి కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని టాక్. ఈ సినిమాకు కోమలి అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ సినిమాలో జయం రవి వేసే 9 గెటప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు.
ఒక్కో గెటప్ సినిమా ట్విస్ట్ కు కారణం అవుతుందట. ఆసక్తికర కథాంశంతో తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. జయం రవి సరసన కాజల్, సంయుక్తా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో యోగిబాబు కామెడియాన్ గా నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల కానుంది. మరి తొమ్మిది గెటప్స్ లో జయం రవి ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.