Janhvi Kapoor: అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 1 సూపర్ హిట్ కావడంతో పుష్ప 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈక్రమంలో సినిమాకు ఉత్తరాదిన ఎక్కువ ధియేటర్లు కేటాయించారు. దీంతో రీ-రిలీజ్ కావాల్సిన ‘ఇంటర్ స్టెల్లార్’ సినిమా వాయిదా పడిందనే విమర్శలు వచ్చాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హీరోయిన్ జాన్వీ కపూర్ పుష్ప2కు మద్దతిస్తూ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.
‘అందరూ పుష్ప 2పై విమర్శలెందుకు చేస్తున్నారో అర్ధం కావడం లేదు. ఇది కూడా సినిమానే కదా. మనం హాలీవుడ్ సినిమా కోసం మన సినిమాను విమర్శిస్తున్నాం. కానీ.. అదే హాలీవుడ్ మన సినిమాను ప్రశంసిస్తోంది. దీనికి మనం గర్వపడాలి. ఖచ్చితంగా ఇంటర్ స్టెల్లార్ అద్భుతమైన సినిమా. కానీ.. మన సినిమాను అవమానిస్తుంటే బాధగా ఉంద’ని అన్నారు.
జాన్వీ కపూర్ మద్దతివ్వడంతో నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. చాలా ధైర్యంగా మన సినిమా కోసం నిలబడ్డారంటూ కామెంట్స్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ ఇటివలే దేవరలో నటించింది. ఇప్పుడు రామ్ చరణ్ తో నటిస్తోంది.