Janhvi Kapoor: ఎన్టీఆర్-జాన్వీ కపూర్ జంటగా నటించిన సినిమా దేవర. ఇటివల విడుదలైన రొమాంటిక్ సాంగ్ యూ ట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది. ఎన్టీఆర్-జాన్వీ కెమెస్ట్రీ, డ్యాన్స్, లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూ నెం.1లో కొనసాగుతోందని.. ఇప్పటివరకూ 45మిలియన్ వ్యూస్ వచ్చాయని చిత్ర యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసింది.
ఈక్రమంలో ‘చుట్టమల్లే..’ పాటకు సంబంధించి బీటీఎస్ (బిహైండ్ ది సీన్స్) పేరుతో జాన్వీ కపూర్ ఓ వీడియో విడుదల చేశారు. కొలనుగట్టుపై.. కలువ పువ్వుల మధ్య జాన్వీ సరాదాగా అల్లరి చేస్తున్న వీడియోలో జాన్వీ కపూర్ దేవకన్యలా మెరిసిపోతోంది. దీంతో ఈ వీడియోపై ఆమె స్నేహితుడు.. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహాడియా జాన్వీని ఉద్దేశించి చేసిన కామెంట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
‘వావ్.. ఎవరీ దేవత’ అంటూ చేసిన కామెంట్ బాగా వైరల్ అవుతోంది. దీంతో ఆమె అభిమానులు పాట బిహైండ్ ది సీన్స్ పై కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram