Switch to English

జనసేనాని పవన్ కళ్యాణ్ స్ట్రెయిట్ క్వశ్చన్: జగన్ సమాధానం చెప్పగలరా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,470FansLike
57,764FollowersFollow

‘కాపు సామాజిక వర్గం ఓట్లను గంపగుత్తగా టీడీపీకి అమ్మేస్తారు..’ అంటూ ఇటీవలే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘కాపు నేస్తం’ నిధుల విడుదల కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఓ ముఖ్య మంత్రి నోట కులాల ప్రస్తావన రావడం, కాపు సామాజిక వర్గం అమ్ముడైపోతుందనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించడం అత్యంత దురదృష్టకరమంటూ కాపు సామాజిక వర్గ ప్రతినిథులు కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

అయితే, ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాస్త లేటుగా స్పందించారు. కానీ, చాలా ఘాటుగా స్పందించారు పవన్ కళ్యాణ్.! ‘ముఖ్యమంత్రి కులాల ప్రస్తావన తీసుకొస్తున్నారు. వైసీపీ హయాంలో కాపు సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి లభిస్తుందా.? శెట్టి బలిజ సామాజిక వర్గానికి రాజ్యాధికారం లభిస్తుందా.? రెల్లి కులస్తుల్ని ముఖ్యమంత్రి పీఠమెక్కిస్తారా.?’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారు.

కాగా, ‘పవన్ కళ్యాణ్ పేరు చివర్న కులాల ప్రస్తావన వుండదు. దానికి సంబంధించిన తోకలేమీ వుండవు. కానీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరులో కుల ప్రస్తావన వుంటుంది. కులం పేరుతో రాజకీయం చేసేది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. కానీ, పవన్ కళ్యాణ్ మీద కులం పేరుతో ఆరోపణలు చేస్తంటారు..’ అంటూ జనసేన నేతలు, జనసైనికులు నినదిస్తూ వస్తున్న విషయం విదితమే.

‘ముఖ్యమంత్రి పదవిని వెతుక్కుంటూ నేను వెళ్ళను.. నన్ను వెతుక్కుంటూ ముఖ్యమంత్రి పదవి రావాలి. పదవుల కోసం పార్టీ పెట్టలేదు.. ప్రజల కోసం పార్టీ పెట్టాను. ప్రజలు ప్రస్తుత రాజకీయాల్లో నలిగిపోతున్నారు. జనసేన వారికి మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.. సమర్థులైనవారిని అధికారంలో కూర్చోబెడితే అద్భుతాలు జరుగుతాయ్..’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

‘భీమ్లానాయక్’ సినిమా కోసం అధికార యంత్రాంగం మొత్తాన్నీ వాడేసిన వైసీపీ, వికలాంగులకు పెన్షన్లు ఇవ్వడానికి ఆ అధికార యంత్రాంగాన్ని ఎందుకు వాడలేకపోతోందని ప్రశ్నించారు. ‘రావోయి మా కంట్రీకి.. తిననీకి బ్రౌను షుగరు మందతున్నది.. తాగనీకి సర్కారు సారున్నది..’ అని పాట రాస్తే, ‘మా కంట్రీకి’ అన్న పదాన్ని తొలగించమంది సెన్సార్ బోర్డ్.. అన్న విషయాన్ని ప్రస్తావించిన పవన్, ఇప్పుడైతే ‘ఆంధ్రప్రదేశ్‌లో..’ అని మార్చి ఆ పాట రూపొందించేవాళ్ళమని ఎద్దేవా చేశారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

ఎక్కువ చదివినవి

వైసీపీ వద్దే వద్దు: ఉత్తరాంధ్ర గ్రౌండ్ రిపోర్ట్ ఇదీ.!

ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఓ చిన్నపాటి గ్రౌండ్ రిపోర్ట్.. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్‌కి కారణమవుతోంది.! అసలేంటా గ్రౌండ్ రిపోర్ట్.? ఎవరు చేశారోగానీ, ఈ గ్రౌండ్...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు. ‘డాక్టర్’ రామ్ చరణ్ అయ్యారు. చెన్నైకి...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు,. ఇప్పటికే రిలీజ్...