తెలుగు దేశం పార్టీ – జన సేన పార్టీ ప్రస్తుతానికి పొత్తులో వున్నాయ్. భారతీయ జనతా పార్టీకీ, జన సేన పార్టీకీ మధ్యన పొత్తు వుంది. కలవాల్సింది టీడీపీ – బీజేపీ మాత్రమే. ఆ రెండూ కలిస్తే, టీడీపీ – జనసేన – బీజేపీ.. ఈ మూడింటి కలయికతో ఏర్పడ్డ కూటమి, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ధీటుగా నిలబడగలుగుతుంది.
అదే జరిగితే, వచ్చే ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోతుందని, వైసీపీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఢిల్లీకి హుటాహుటిన వెళ్ళి, ‘ఎన్డీయేలో చేరతాం’ అనే ప్రతిపాదనని ప్రధాని నరేంద్ర మోడీ వద్ద తెచ్చారన్న ప్రచారం జరుగుతోంది.
ఇదిలా వుంటే, జనసేనకు కేటాయించే సీట్ల విషయమై టీడీపీ నుంచి పైకి ఓ మాట, లోపల ఇంకో మాట వినిపిస్తోంది. టీడీపీ అను‘కుల’ మీడియా లెక్కలు అత్యంత హేయంగా వున్నాయి. వీటిని, టీడీపీ ఖండించడంలేదు. జనసేన ఈ విషయమై గుస్సా అవుతోంది.
వాస్తవ పరిస్థితి ఏంటంటే, జనసేనాని గట్టిగా కోరితే, చెరి సగం సీట్ల ప్రతిపాదనకు చంద్రబాబు ఓకే చెప్పడం మినహా ఇంకో ఆప్షన్ లేదు. అయితే, ఎన్ని సీట్లలో పోటీ చేశామన్నది ముఖ్యం కాదు.. పోటీ చేసిన సీట్లన్నిటిలోనూ గెలవాలన్నదే ముఖ్యమని జనసేనాని అంటున్నారు.
ఆ లెక్కన, 68 సీట్ల వరకూ జనసేన ఖచ్చితంగా గెలవగలదన్నది ఓ అంచనా. ఈ విషయమై టీడీపీ కూడా ఓ ఖచ్చితమైన అవగాహనతో వుంది. అయితే, 38 నుంచి 45 సీట్లన్న ప్రచారం, బీజేపీ కూడా రంగంలోకి దిగుతుంది కాబట్టి, ఆ ఫిగర్ మంచిదేననే విశ్లేషణలు.. వెరసి, జనసేనాని ఒకింత సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది.
‘స్ట్రైక్ రేట్ 98 శాతం’ అని జనసేనాని ఊరకే అన్లేదు. అందుకు తగ్గ వ్యూహంతో జనసేనాని వున్నారు. అభ్యర్థులూ దాదాపు సిద్ధమే. ఇంకా అధికార వైసీపీ నుంచి చేరికలున్నాయ్. ఈ నేపథ్యంలో ప్రతి అడుగూ ఆచి తూచి వేయాల్సి వుంది. అవసరమైతే, చెరి సగం ఆలోచన గట్టిగానే ముందుకు తీసుకెళ్ళేలా వున్నారు జనసేనాని. అప్పుడిక టీడీపీకి ఇంకో ఆప్షన్ వుండదు. బీజేపీకి కేటాయించే సీట్లు నామమాత్రమే అవుతాయ్ ఎలాగూ.!