Switch to English

ఇప్పటం బాధితులకి జనసేనాని సాయం: రాజువయ్యా.! మహరాజువయ్యా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

‘బాబ్బాబూ.. ఒక్క ఛాన్స్.. నాకు అధికారమివ్వండి.. మీ జీవివాల్ని బాగు చేస్తా..’ అంటూ జనాన్ని ఓట్ల కోసం దేబిరించి, వారిని ఏమార్చి.. ఓట్లేయించుకుని, అధికార పీఠమెక్కిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అధికార పీఠమెక్కాక మానవత్వం మరిచిపోయారన్న విమర్శ.. ఆయన్ని గద్దెనెక్కించిన ప్రజల నుంచే వినిపిస్తోంది.

‘నీకు మేం అధికారం ఇస్తే.. మాకు నిలువ నీడ లేకుండా చేస్తావా.? నాశనమైపోతావ్.. మా ఉసురు నీకు తగులుతుంది..’ అంటూ గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామస్తులు శాపనార్థాలు పెడుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి. 600 ఇళ్ళున్న గ్రామానికి 120 అడుగుల వెడల్పుతో రోడ్లు విస్తరించడమట.. ఈ క్రమంలో మహనీయుల విగ్రహాలు, దేవతా మూర్తుల విగ్రహాల్ని తొలగించి.. వైఎస్సార్ విగ్రహాల్ని అలాగే వుంచడమట.. అని గ్రామస్తులు నిట్టూరుస్తున్న సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో రోడ్ల దుస్థితి ఎలా వుందో నిత్యం చూస్తూనే వున్నాం. రోడ్ల మీద గుంతల్ని పూడ్చలేరుగానీ, రోడ్ల వెడల్పు పేరుతో గ్రామాల్ని నాశనం చేస్తున్నారన్నది ఇప్పటం గ్రామస్తుల విమర్శ. జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ఇప్పటం గ్రామస్తులు భూమి ఇవ్వడంతో, ఇప్పటంపై అధికార పార్టీ కన్నెర్రజేసింది.. ఈ క్రమంలోనే రోడ్ల వెడల్పు పేరుతో, గ్రామస్తలు ఇళ్ళపైకి జేసీబీలు వెళ్ళాయ్.

జనసేన అధినేత ఇటీవల ఆ గ్రామాన్ని సందర్శించారు.. బాధితుల్ని ఓదార్చారు. అధికార పార్టీకి అల్టిమేటం జారీ చేశారు. తాజాగా మరోమారు ఇప్పటం గ్రామస్తుల పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మానవత్వం చాటుకున్నారు. ఒక్కో బాధిత కుటుంబానికీ లక్ష రూపాయల సాయం జనసేన పార్టీ నుంచి అందించనున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

గతంలో ఇప్పటం గ్రామానికి 50 లక్షల రూపాయలను గ్రామాభివృద్ధి కోసం జనసేనాని ఇచ్చిన సంగతి తెలిసిందే. దానికి, ఇప్పుడు ఇవ్వబోయే మొత్తం అదనం. అధికారంలో వున్నోళ్ళేమో విధ్వంసాలకు పాల్పడుతోంటే.. అధికారం లేని జనసేన పార్టీ.. ధ్వంసమైన ఇళ్ళకీ, జీవితాలకీ భరోసా ఇస్తోంది. అందుకేనేమో, ‘రాజువయ్యా.. మహరాజువయ్యా..’ అంటూ జనసేనానిని కీర్తిస్తున్నారు ఇప్పటం గ్రామస్తులు.

మరి, ఈ కీర్తనల ఫలితంగా ఇప్పటం గ్రామస్తుల్ని వైసీపీ ఇంకెలాంటి ఇబ్బందులు పెడుతుందో.! ఈసారి విమానశ్రయమో, లేదంటే నౌకాశ్రయో ఇప్పటంలో నిర్మిస్తామని చెప్పి.. గ్రామాన్ని ఖాళీ చేయించెయ్యదు కదా.? అని నెటిజన్లు సెటైర్లేస్తున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి.. గాజువాకలో గందరగోళం

Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది.  చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...