Switch to English

ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు: జనసేన పెర్‌ఫెక్ట్ కార్టూన్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

ఒక సద్విమర్శ వందల మందిలో చైతన్యాన్ని కలిగిస్తుంది. ఓ విమ్శనాత్మకమైన కార్టూన్ లక్షల మందిని ప్రభావితం చేస్తుంది.! జనసేన పార్టీ ఇటీవలి కాలంలో ‘కార్టూన్ల’ ద్వారా అధికార వైసీపీకి షాక్ ఇవ్వడం వెనుక అసలు కారణం ఇదే. ప్రతి కార్టూన్ ఆలోచింపజేసేదిగానే రూపొందుతోంది. ఆ ప్రతి కార్టూన్‌లోనూ హెలికాప్టర్ బొమ్మని దాదాపుగా వుంచుతోంది జనసేన పార్టీ.

హెలికాప్టర్ అంటే, అదేదో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు గనుక.. అని కాదు.! అధికారంలో వున్నవారు ఎంతసేపూ గాల్లో తేలియాడుతూ ఆల్ ఈజ్ వెల్.. అనుకోవడం కాదు, నేల మీదకు కూడా దిగి వాస్తవాలు చూడాలలనే అర్థంలోనే ఆ హెలికాప్టర్‌ని జనసేన పార్టీ తప్పక తమ కార్టూన్లలో పొందు పరుస్తోందన్నమాట.

ఇక, తాజా కార్టూన్ విషయానికొస్తే, ‘అన్నా నేల మీదక్కూడా కాస్త చూడండన్నా..’ అంటూ ఓ మహిళ దీనంగా వేడుకుంటోంది హెలికాప్టర్‌లో వెళ్ళిపోతోన్న ముఖ్యమంత్రిని చూసి. తనపై కొందరు అఘాయిత్యం చేస్తోంటే, ఆ మహిళ దీనంగా ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తోంది. ‘మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాల కేసుల్లో ఏపీ మొదటి పది స్థానాల్లో వున్నప్పటికీ మౌనంగా వున్న ప్రభుత్వం..’ అంటూ పేర్కొన్నారు కార్టూన్‌లో.

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయన్నది బహిరంగ రహస్యం. ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో కృష్ణా నది ఒడ్డున కొన్నాళ్ళ క్రితం ఓ మహిళపై జరిగిన అఘాయిత్యం అప్పట్లో పెను సంచలనం. ఇలాంటివి బోల్డన్ని జరిగాయి, జరుగుతూనే వున్నాయ్.

ఆయా ఘటనల్లో నిందితులు టీడీపీ వారేనంటూ రాజకీయ విమర్శ చేసి చేతులు దులుపుకుంటోంది వైసీపీ ప్రభుత్వం. ఓ అత్యాచార ఘటనపై హోం మంత్రి స్పందిస్తూ, ‘నిందితులు అత్యాచారం చేయడానికి రాలేదు. దొంగతనం చేయడానికి వస్తే.. అలా జరిగిపోయింది..’ అని చెప్పడం, సమస్య తీవ్రతను తగ్గించి చూపే ప్రయత్నం కాక మరేమిటి.?

మరో ఘటనపై స్పందిస్తూ, ‘ఇంట్లో తల్లి పెంపకం సరిగ్గా వుంటే..’ అంటూ హోంమంత్రి వ్యాఖ్యానించడమూ పెను రాజకీయ దుమారానికి కారణమయ్యింది. ఎంతసేపూ మంత్రుల్ని, విపక్షాలపై బూతులు తిట్టడానికే ఉపయోగిస్తున్న అధికార పక్షం, ప్రజల కోసం పని చేయాల్సిన బాధ్యత మంత్రుల మీద వుందన్న కనీస విజ్ఞతను నేర్పకపోవడం వల్లనే ఈ దుస్థితి.

ముఖ్యమంత్రి గాల్లో పర్యటనలు చేస్తూ ‘ఆల్ ఈజ్ వెల్’ అనుకుంటోంటే, మహిళల పట్ల అఘాయిత్యాలు పెరగక.. తగ్గుతాయా.? అందునా, పోలీసు వ్యవస్థ కేవలం, విపక్షాలపై అధికార పక్షం చేసే రాజకీయ పోరాటానికి అండగా నిలిచేందుకే అన్నట్లు వ్యవహరించడం వల్ల, కూడా ఈ దుస్థితి అన్న మిర్శలూ లేకపోలేదు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...