జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలకు సంబందించి ప్రకటన వచ్చింది. జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను మార్చి 14న నిర్వహించనున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను పిఠాపురంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పిఠాపురంలోనే పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించాలని జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు.
జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ తో గెలిచి జనసేన పార్టీ సత్తా చాటింది. ఐతే ఎన్నికలు జరిగిన తర్వాత మొదటిసారి జరుపుకుంటున్న వేడుకలు కాబట్టి ఈ సభని గ్రాండ్ సక్సెస్ చేయాలని జనసేన పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక జరగబోతున్న పార్టీ ఆవిర్భావ సభ కాబట్టి ఈ సభ పట్ల ప్రజల్లో ఆసక్తి మొదలైంది. రాష్ట్ర రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ గా మారిన జనసేన పార్టీ 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో గెలిచిన తర్వాత ఏర్పాటు చేస్తున్న మొదటి ఆవిర్భావ వేడుకలు కాబట్టి ఈ సభ మీద సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. ఈ వేడుకల్లో జనసేన విధివిధానాలు ఇంకా పార్టీ కార్యచరణల గురించి అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు సూచిస్తారని తెలుస్తుంది.