Switch to English

టీడీపీకి జనసేన ఝలక్: సీఎం పదవి పవన్ కళ్యాణ్‌కి ఇచ్చేస్తారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ వైపు సంధిస్తున్న ప్రేమ బాణాలకు అటువైపు నుంచి కౌంటర్ ఎటాక్ కూడా అంతే స్థాయిలో ఎదురవుతోంది. ‘ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్‌కి వదిలేస్తారా.? అలాగైతే చెప్పండి..’ అంటూ జనసేన పార్టీ నుంచి అధికారిక ప్రకటన ఏమీ రాలేదుగానీ, సోషల్ మీడియా వేదికగా జనసేన మద్దతుదారులు మాత్రం ప్రతిపాదన పేరుతో ఝలక్ ఇస్తున్నారు.

చాలామంది జనసేన నేతల్లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతున్నా, అధినేత నిర్ణయం తీసుకునేంతవరకు ఈ విషయమై అధికారికంగా ఎవరూ మాట్లాడలేని పరిస్థితి. ‘మేం వన్ సైడ్ లవ్ చేస్తున్నాం..’ అని సాక్షాత్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ఒప్పుకున్నాక, ఇంతకన్నా దిగజారుడుతనం ఇంకేముంటుంది.? టీడీపీ ఖేల్ ఖతం అయిపోయింది.. అందుకే, జనసేన మద్దతు కోసం ఇంతలా దిగజారిపోయింది.. అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అయితే, ఇంకోసారి టీడీపీతో జతకట్టడం వల్ల జనసేన మరింతగా నష్టపోతుంది తప్ప, లాభపడే ప్రసక్తే లేదన్నది జనసేన శ్రేణులు చెబుతున్నమాట. అందులోనూ నిజం లేకపోలేదు. ‘శతృవుకి శతృవు మిత్రుడు అయ్యేందుకు అవకాశాలు వుండొచ్చుగానీ, అక్కడున్నది వెన్నుపోటు స్పెషలిస్ట్ చంద్రబాబు..’ అని జనసేన నేతలు అంటున్నారు.

కాగా, బీజేపీ – జనసేన మధ్య పొత్తు వుందనీ, టీడీపీతో బీజేపీగానీ, జనసేనగానీ కలిసి నడిచే అవకాశమే లేదని బీజేపీ నేతలు కుండబద్దలుగొట్టేస్తున్నారు. టీడీపీ నేతలు మాత్రం, 2024 ఎన్నికల్లో జనసేన తమతో కలిసి వస్తుందనీ, బీజేపీ కూడా కలిసొచ్చే అవకాశాలున్నాయంటున్నారు.

‘ఛీ పొమ్మంటున్నా..’ టీడీపీ నేతలు మాత్రం, జనసేన వైపూ.. బీజేపీ వైపూ చూస్తుండడం టీడీపీ ప్రస్తుతం వున్న దుస్థితిని చెప్పకనే చెబుతున్నాయి. మరోపక్క, బులుగు మీడియా ‘గోతికాడ నక్కలా’ సరైన అవకాశం కోసం ఎదురుచూస్తోంది.. జనసేన పార్టీపై బురద చల్లడం కోసం. చంద్రబాబు తానా అంటే ఇలాంటి విషయాల్లో బులుగు మీడియా తందానా అనడం వింతేమీ కాదు కదా.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

Raadhika : నటి రాధిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Raadhika : సీనియర్ నటి రాధిక పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం తెల్సిందే. తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్‌ స్థానంను బీజేపీ నటి రాధిక కు ఇవ్వడం జరిగింది. గత కొంత...

Janhvi Kapoor : ‘పుష్ప – 2’ కి జాన్వీ ఓకే చెప్పిందా? లేదా?

Janhvi Kapoor : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పుష్ప సినిమాలో సమంతతో చేయించిన ఐటెం సాంగ్‌ బ్లాక్ బస్టర్‌...

Ram Charan Birthday special: విమర్శలకు చెక్.. విమర్శకులకు సమాధానం.. రామ్ చరణ్

Ram Charan: సినిమా బాషలో ఓ మాట ఉంది. ‘విమర్శకుల మెప్పు పొందిన సినిమా.. హీరో’ అని. సినిమాలో లోపాలు, హీరో నటనపై, దర్శకుడి ప్రతిభపై విమర్శలు చేస్తూ.. ఒకరకంగా హీరో, దర్శకుడు,...

రఘురామ కృష్ణరాజుకి ఎందుకిలా జరిగింది చెప్మా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితమే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ముందర చేసిన రాజీనామా కావడంతో, అది ఆమోదం పొందలేదు. చాలాకాలంగా...