Janasena: పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్థాపించిన జనసేన (Janasena) పార్టీ ప్రస్థానం మొదలై 10ఏళ్లు పూర్తయ్యాయి. సుదీర్ఘ పోరాటం తర్వాత కూటమితో కలిసి అధికారంలోకి వచ్చింది జనసేన. పోటీ చేసిన 21అసెంబ్లీ, 2పార్లమెంట్ స్థానాల్లో విజయదుంధుభి మోగించి దేశంలోనే చెరిగిపోని రికార్డు సృష్టించింది. పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రి అయ్యారు. ఈక్రమంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించింది.
జూలై 18న ప్రారంభమైన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. 3నెలల క్రితం సభ్యత్వ గడువు ముగిసినా ఎన్నికల సమయంలో గందరగోళం ఊండకూడదని అప్పట్లో నిలిపివేశారు. అందుకు సంబంధించిన రెన్యువల్ మొత్తాన్ని పవన్ కల్యాణే చెల్లించారు. ప్రస్తుత సభ్యత్వ కార్యక్రమం ద్వారా 9లక్షల సభ్యత్వాలు నమోదు చేయాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందుకు సమీపంలోని జనసేన వాలంటీరును సంప్రదించి సభ్యత్వం తీసుకోవాలని తద్వారా బీమా సౌకర్యం కూడా పొందాలని పార్టీ సూచించింది. పార్ట రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జూలై 28 వరకూ సభ్యత్వ కార్యక్రమం కొనసాగనుంది.