Switch to English

జనసేన ‘పవర్’ పంచ్: బెయిల్ మీదున్న జైల్ రెడ్డి.!

నాలుగు విమర్శలు చేయడం, నలభై నాలుగు విమర్శల్ని ఎదుర్కోవడం.. ఇదేదో దేశాన్ని ఉద్ధరించేసే పనిగా పెట్టుకున్నట్టునారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. లేకపోతే, సీపీఎస్ రద్దు చేస్తానని ఎన్నికల ముందర మాటిచ్చి, ఎన్నికలయ్యాక మాట తప్పిన వైఎస్ జగన్.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పిన వైఎస్ జగన్.. అవన్నీ మానేసి, ‘చంద్రబాబుకి దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్..’ అంటూ పద్ధతీ పాడూ లేని ‘లేకి’ విమర్శలు ఎందుకు.?

సరే, రాజకీయాల్లో విమర్శలు సహజమే కావొచ్చు.! 2024 ఎన్నికల్లో ఓడిపోబోతున్నామనే ఆందోళన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వుండొచ్చు. అంతమాత్రాన, అధికారిక కార్యక్రమాల్లో ప్రజల ముందు అర్థం పర్థం లేని విమర్శలు చేస్తే ఎలా.? దత్త పుత్రుడు రైతుల విషయంలో మొసలి కన్నీరు కార్చుతున్నారనీ, పట్టాదారు పాసుపుస్తకం వున్న ఒక్క రైతుకి సంంబంధించి కూడా చనిపోయాడని చూపలేకపోతున్నారనీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎద్దేవా చేయడాన్ని జనసేన తీవ్రంగా ఖండించింది.

జనసేన కీలక నేతల్లో ఒకరైన బొలిశెట్టి సత్య అయితే, ఏకంగా ‘నువ్వు బెయిల్ మీదున్న జైల్ రెడ్డివి..’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘నువ్వెవడివి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్‌ని జతకట్టడానికి.? చంద్రబాబునీ, ఆయన కుమారుడు లోకేష్‌నీ జైలుకు పంపకుండా కాపాడుతున్నది నువ్వు.. మీరంతా తోడు దొంగలు..’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

‘రాజన్న చెత్తపుత్రుడు.. చంచల్‌గూడా జైలు పుత్రుడు..’ అంటూ మొదలు పెట్టిన బొలిశెట్టి సత్య, తన విమర్శల ప్రవాహాన్ని కొనసాగించారు. ‘కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాల్సింది ప్రభుత్వమే. గుర్తింపు కార్డులు లేకపోతే అసలు వాళ్ళు రైతులే కాదా.? ఇదెక్కడి పంచాయితీ.? అంటూ బొలిశెట్టి మండిపడ్డారు. సీపీఎస్ రద్దు సహా అనేక అంశాలపై రాష్ట్ర ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్‌ని విమర్శించే నైతిక అర్హత లేదన్నారాయన.

‘అయిపోయింది, మీ పనైపోయింది ఏ1 సహా ఏ2, ఏ3 అందరూ హ్యపీగా జైలుకెళ్ళే రోజు దగ్గరలోనే వుంది’ అంటూ బొలిశెట్టి సెటైర్లు వేయడం కొసమెరుపు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

క్రైమ్, సస్పెన్స్, రొమాన్స్, కామెడీతో.. ‘అం అః’ సినిమా..! ట్రైలర్ విడుదల

సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా శ్యామ్ మండల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అం అః'. (ఎ డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్లర్) ట్యాగ్‌లైన్‌. రంగ‌స్థలం మూవీ...

లైగర్ ‘పీకే’ పోస్టర్‌ తో పబ్లిసిటీ పీక్స్‌

డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాద్ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమా వచ్చే నెలలో విడుదల కాబోతుంది. షూటింగ్ ముగిసి నెలలు గడుస్తోంది....

పుష్ప 2 ఫైనల్ వర్షన్‌ ఇంకా రెడీ అవ్వలేదట

అల్లు అర్జున్‌.. సుకుమార్‌ ల కాంబోలో గత ఏడాది చివర్లో వచ్చిన పుష్ప సినిమా సెన్షేషనల్ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతటి ఘన విజయాన్ని సొంతం...

దిల్ రాజు ప్లాన్ తో ఆ సినిమాల రిలీజ్ షెడ్యూల్స్ గందరగోళం

టాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ కమ్‌ డిస్ట్రిబ్యూటర్‌ దిల్‌ రాజు సినిమా ల రిలీజ్ విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన థాంక్యూ సినిమా...

మేజర్‌ కు అక్కడ కూడా బ్రహ్మరథం

అడవి శేష్‌ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన మేజర్‌ సినిమా విడుదల అయిన ప్రతి చోట కూడా పాజిటివ్‌ రెస్పాన్స్ ను దక్కించుకుంది....

రాజకీయం

మోదీ పర్యటనకు వ్యతిరేకంగా నల్ల బెలూన్లతో నిరసన..! పలువురి అరెస్టు

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు....

‘వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే..’ అల్లూరి జయంతి వేడుకల్లో కేటీఆర్

వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై...

ఫాఫం రఘురామ.! చేసుకున్నోడికి చేసుకున్నంత.!

అంతన్నాడింతన్నాడే గంగరాజు.. అన్న పాట గుర్తుకొస్తోంది వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజా పరిస్థితి చూస్తోంటే. కొండంత రాగం తీసి తుస్సుమనిపించేశారాయన. ఔను మరి, కోర్టుకెళ్ళారు.. ప్రత్యేక హెలికాప్టర్ అన్నారు.. చివరికి రైలులో పయనమైనా,...

యావత్ భారతావని తరపున అల్లూరికి పాదాభివందనం చేస్తున్నా: ప్రధాని మోదీ

భారతావని మన్యం వీరుడు, విప్లవ జ్యోతి, తెలుగు జాతి యుగపురుషుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ఇక్కడ మనమంతా కలుసుకోవడం అదృష్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు...

అల్లూరి చుట్టూ రాజకీయం.! ఇదా ఆయనకిచ్చే గౌరవం.?

ఓ సినీ కవి, మహాత్మాగాంధీని ఉద్దేశిస్తూ.. ‘ఇలా నడి రోడ్డు మీదా.. కరెన్సీ నోటు మీదా.. మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ..’ అంటాడు. మహనీయుల్ని మనం ఎలా చూస్తున్నాం.? అన్న విషయమై...

ఎక్కువ చదివినవి

రాశి ఫలాలు: శుక్రవారం 01 జూలై 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం సూర్యోదయం: ఉ.5:34 సూర్యాస్తమయం: సా.6:38 తిథి: ఆషాఢ శుద్ధ విదియ ఉ.10:43 ని . వరకు తదుపరి ఆషాఢ శుద్ధ తదియ సంస్కృతవారం: భృగు వాసరః...

విజయమ్మ వైసీపీకి రాజీనామా చేశారని చెబితే అరెస్ట్ చేస్తారా.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు రాజీనామా చేసినట్లుగా ఓ ఫేక్ ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా టీడీపీ మద్దతుదారుడైన గార్లపాటి వెంకటేశ్వరరావు చేశారట. ఈ విషయమై అందిన ఫిర్యాదు మేరకు...

జనసేనాని జనవాణి: ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ని సమస్యలున్నాయా.?

వాలంటీర్ వ్యవస్థ ఏం చేస్తోంది.? అధికారులు ఏం చేస్తున్నారు.? అసలు రాష్ట్రంలో ప్రభుత్వం వుందా.? లేదా.? ‘అన్నీ చేసేస్తున్నాం.. అందర్నీ ఉద్ధరించేస్తున్నాం.. అందుకే, అప్పులు కూడా చేస్తున్నాం.. మేం చేస్తున్న అభివృద్ధి.. మేం చేస్తున్న...

‘తండ్రిగా గర్వపడుతున్నా..’ కుమార్తె హర్షకు సీఎం జగన్ శుభాకాంక్షలు

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కుమార్తె హర్ష గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. హర్ష చదువుకున్న ఇన్ సీడ్ బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు...

మూడోసారి కూడా జట్టుకట్టనున్న విజయ్, పూరి

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ లు ఏ ముహూర్తాన కలిసారో కానీ వాళ్ళ బంధం విడదీయరానిదిగా ఉంది. ఇటీవలే లైగర్ ను పూర్తి చేసిన ఈ ఇద్దరూ పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే రెండో...