Switch to English

జనసేవ: గ్రౌండ్‌ లెవల్‌లో జనసైనికుల దూకుడు!

జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కన్పిస్తోంది. జనసేన సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ సత్తా చాటుతున్నాయి. కరోనా వైరస్‌ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో కాదు.. కరోనా వైరస్‌ కారణంగా ప్రజలెదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంలోనూ.. జనసేన తరఫున ప్రజలకు ‘సాయం’ అందించడంలోనూ. గ్రామ స్థాయిలో ‘జనసేవ’ పేరుతో జనసైనికులు చాలా యాక్టివ్‌గా వుంటున్నారు.

అలా యాక్టివ్‌గా వ్యవహరిస్తున్నవారికి పార్టీ అధిష్టానం నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మరీ ముఖ్యంగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, స్వయంగా ఆయా యాక్టివిటీస్‌ని తన సోషల్‌ మీడియా హ్యాండిల్‌లో ప్రస్తావిస్తున్నారు. మరోపక్క, న్యూస్‌ ఛానళ్ళ చర్చా కార్యక్రమాల్లోనూ జనసేన నేతలు హుందాగా వ్యవహరిస్తున్నారు.

గతంలో సినిమాటిక్‌గా కన్పించిన జనసైనికుల యాక్టివిటీస్‌.. ఇప్పుడు అత్యంత నిబద్ధతతో కన్పిస్తుండం గమనార్హం. కరోనా వైరస్‌ నేపథ్యంలో జనసేనాని పవన్‌ కళ్యాణ్‌, పార్టీ ముఖ్య నేతలతో నిరంతరం టచ్‌లో వుంటున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. జనసైనికులకూ తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. నిజానికి, మామూలు రోజుల్లో జరిగే యాక్టివిటీస్‌ కంటే, ఇప్పుడు పార్టీ యాక్టివిటీస్‌ మరింత పద్ధతి ప్రకారం నడుస్తున్నాయని గ్రౌండ్‌ లెవల్‌లో జనసైనికులూ అభిప్రాయపడ్తుండడం గమనార్హం.

కరోనా వైరస్‌ నేపథ్యంలో జనం వద్దకు ఏయే పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు విరివిగా వెళుతున్నారు.? అన్న విషయమై ఆరా తీస్తే, జనసైనికులే ఎక్కువ యాక్టివ్‌గా వుంటున్నారని గ్రౌండ్‌ లెవల్‌ నుంచి సమాచారం అందుతోంది. తన చేతిలో అధికారం వున్నా, వైఎస్సార్సీపీ క్యాడర్‌.. కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతున్నారనీ, పైగా పబ్లిసిటీ స్టంట్స్‌ ఎక్కువైపోతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ క్యాడర్‌ అయితే పూర్తిగా నిస్తేజంగానే కన్పిస్తోంది.

కాగా, జనసైనికులు కరోనా వైరస్‌ పట్ల అప్రమత్తంగా వుండాలనీ, కరోనా వైరస్‌ బారిన పడకుండా వుండడంతోపాటు, ఇతరులకు కరోనా వైరస్‌ సోకేలా ఎలాంటి అత్యుత్సాహం ప్రదర్శించవద్దని సాక్షాత్తూ పవన్‌ కళ్యాణ్‌ అప్రమత్తం చేస్తున్నారు జనసైనికుల్ని. అదే సమయంలో, సోషల్‌ మీడియా వేదికగా ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేయొద్దంటూ సూచిస్తుండడం గమనార్హం.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: 91 మందికి కరోనా అంటించిన బార్బర్

ప్రపంచంలో కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దాదాపు రెండు నెలల తర్వాత అమెరికాలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి అనుకుంటున్న సమయంలో...

పిక్ ఆఫ్ ది డే: కొమరం భీమ్ కి రామరాజు బర్త్ డే విషెస్.!

మన నవతరం అల్లూరి సీతారామరాజు అలియాస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా కొమరం భీమ్ అలియాస్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ స్పెషల్ బర్త్ డే టీజర్ ని...

ఫ్లాష్ న్యూస్: వారెవ్వా.. తల్లి కోసం ఐదేళ్ల బాలుడు ఒంటరి ప్రయాణం.!

కరోనా మహమ్మారిని అడ్డుకోవడం కోసం ఇమ్మీడియట్ ఎఫెక్ట్ తో మార్చి లో లాక్ డౌన్ పెట్టడం వలన ఎక్కడి వారు అక్కడే లాక్ అయిపోయారు. చాలా మంది స్వస్థలాలకు వెళ్లాలని ప్రయత్నించి లాభం...

తిరుపతి లడ్డూ అమ్మకంపై రమణ దీక్షితులు అసహనం

రమణ దీక్షితులు.. చంద్రబాబు హయాంలో ‘ఉద్యోగం’ కోల్పోయిన టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడీయన. అప్పట్లో రమణ దీక్షితులు చేసిన పొలిటికల్‌ యాగీ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత ఆయన అప్పటి ప్రతిపక్ష...

బర్త్ డే స్పెషల్: రాఘవేంద్రరావు సృష్టించిన అద్భుతాలు ఎన్నో.. అందులో టాప్ 10.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిగ్దర్శకులుగా చెప్పుకోదగ్గ దర్శకుల్లో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఒకరు, ఆయన సినిమాలకి తెలుగు సినీ చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. శతాధిక చిత్రాల దర్శకుడిగా ఎన్నో అపురూపమైన సినిమాలను...