Switch to English

జనసేన కు బీజెపి నుంచి తగిన సపోర్ట్ లభిస్తుందా?

బీజేపీ – జనసేన పార్టీ మధ్య పొత్తు కొద్ది నెలల క్రితం చిగురించడం, ఇరు పార్టీలు కలిసి సంయుక్తంగా పలు అంశాలపై ప్రకటనలు చేస్తుండడం చూస్తున్నాం. అయితే, కొంత మంది జనసైనికుల్లో మొదటి నుంచీ బీజేపీ పట్ల కొంత వ్యతిరేకత వున్న మాట వాస్తవం. అయినాగానీ, అధినేత పవన్‌ కళ్యాణ్‌ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి జనసైనికులు వ్యవహరిస్తున్నారు, బీజేపీ క్యాడర్‌తో కలిసి పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే, బీజేపీ నుంచి మాత్రం జనసేనకు రావాల్సిన స్థాయిలో సపోర్ట్‌ రావడంలేదు. చాలా అంశాల్లో బీజేపీ, జనసేనను లైట్‌ తీసుకుంటోంది. రాష్ట్రంలో ఓటు బ్యాంకు లెక్కల్ని తీసుకుంటే, జనసేన కంటే బీజేపీ చాలా చిన్న పార్టీ. కానీ, బీజేపీ కేంద్రంలో పవర్‌లో వుంది. అది బీజేపీకి ప్లస్‌ పాయింట్‌.

ఇదిలా వుంటే, గత కొద్ది రోజులుగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, బీజేపీ జపం కొంచెం చేస్తున్నట్లే కన్పిస్తోంది. దీన్ని కొంత మంది జనసైనికులు జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడుతోందన్నది నిర్వివాదాంశం. ప్రధానికి పవన్‌ కళ్యాణ్‌ పలు సందర్భాల్లో కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్లేస్తోంటే, అటు వైపు నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడంలేదు.

కరోనా వైరస్‌ నేపథ్యంలో, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తెలుగువారి గురించి పవన్‌ కళ్యాణ్‌ చాలా తపన పడ్డ మాట వాస్తవం. ఈ క్రమంలో కొందరు బీజేపీ నేతలు, పవన్‌ కళ్యాణ్‌ కష్టాన్ని గుర్తించినా, బీజేపీ అధిష్టానం నుంచి మాత్రం, పవన్‌ పట్ల అంత సానుకూలత కన్పించడంలేదు. జనసేన – బీజేపీ మధ్య వైరుద్యాల్ని, అమరావతి విషయంలో చూశాం, ఇతరత్రా కొన్ని కీలక సమస్యల విషయంలోనూ  చూశాం..

ఇక, కరోనా నేపథ్యంలో స్థానికంగా జనసైనికులు చాలా కష్టపడుతున్నారు. అయితే, వారితో బీజేపీ నేతలు కలిసి రావడంలేదన్న ఆరోపణలున్నాయి. విశాఖ గ్యాస్‌ లీక్‌ వ్యవహారంలోనూ బీజేపీ – జనసేన మధ్య కమ్యూనికేషన్‌ గ్యాప్‌ సుస్పష్టంగా కన్పిస్తోంది. పార్టీ అధినేతగా పవన్‌ కళ్యాణ్‌, ఈ తరహా సమస్యలపై దృష్టిపెట్టాల్సి వుంది. పార్టీ కార్యకర్తల మనోభావాల్ని తెలుసుకోవాలి. అదే సమయంలో ఇరు పార్టీల మధ్యా కమ్యూనికేషన్‌ గ్యాప్‌ లేకుండా వుండేందుకు తనవంతు ప్రయత్నం చేయాలి.

‘ఓ చేత్తో జనసేన జెండా, ఇంకో చేత్తో బీజేపీ జెండా పట్టుకుంటున్నాం.. కానీ, బీజేపీ ఆ స్థాయిలో జనసేనతో కలిసి రావడంలేదు’ అని జనసైనికులు గ్రౌండ్‌ లెవల్‌లో వ్యక్తం చేస్తున్న ఆవేదనను జనసేన అధినేత ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో.! ఈలోగా జనసేనాని, బీజేపీని మెచ్చుకుంటూ, ప్రధానిని కీర్తిస్తూ వేస్తున్న ట్వీట్లు కొంత మంది జనసైనికులకు అస్సలేమాత్రం మింగుడుపడ్డంలేదు. రాజకీయ ప్రత్యర్థులైతే ఈ విషయమై పవన్‌ కళ్యాణ్‌ని విమర్శిస్తున్న తీరు.. మరీ దారుణంగా వుంటోంది.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

యూపీ సీఎం యోగి నిర్ణయం అదిరింది

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్ లో విధించిన లాక్ డౌన్ కారణంగా కోట్లాది మంది వలస కార్మికులు ఎన్ని అవస్థలు పడ్డారో చూశాం. లాక్ డౌన్ విధించి రెండు నెలలు పూర్తవుతున్నా.. ఇప్పటికీ...

పోతిరెడ్డిపాడుపై ఏపీ సర్కారుకి ఎదురుదెబ్బ

పోతిరరెడ్డిపాడు సామర్థ్యం పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్ దూకుడికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) బ్రేక్ వేసింది. ఈ ప్రాజెక్టు కారణంగా పర్యావరణంపై పడే ప్రభావం గురించి అధ్యయనం చేసి ఇచ్చేందుకు నాలుగు శాఖలతో...

మహేష్ అభిమానులకు కూడా నిరాశ తప్పేలా లేదు

రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ అంతా ఆర్ ఆర్ ఆర్ నుండి అప్డేట్ కోసం ఎదురుచూసారు. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా పనులేం జరగలేదు కాబట్టి ఆర్ ఆర్...

ఇన్‌సైడ్‌ స్టోరీ: తెలంగాణలో కరోనా టెస్టులు పెరగాల్సిందే.!

దేశంలోని ప్రముఖ నగరాల్లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. వాటన్నిటితో పోల్చి చూస్తే, హైద్రాబాద్‌ పరిస్థితి కాస్త బెటర్‌. తెలంగాణలో గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలోనే ఎక్కువగా కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. మిగతా...

క్రైమ్ న్యూస్: కలకలం రేపుతున్న బావిలో మృతదేహాలు

వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం గొర్రెకుంటలోని ఓ వరుసగా మృతదేహాలు బయటపడడం ఆ ప్రాంతంతో తీవ్ర కలకలం రేపుతోంది. ముందురోజు నాలుగు మృతదేహాలు లభ్యమవగా.. ఈ రోజు ఉదయం మరో మూడు మృతదేహాలు...