తమిళనాట డీఎంకే మద్దతుదారులు, డీఎంకే పార్టీ కోసం పని చేసే కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్, తిరుపతిలో జనసేనాని నిర్వహించిన వారాహి డిక్లరేషన్ సభ తర్వాత పవన్ కళ్యాణ్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడటం చూశాం.
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయ నిధి స్టాలిన్ మీద పరోక్షంగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘సనాతన ధర్మం’ గురించి చేసిన వ్యాఖ్యలతో, సదరు డీఎంకే సోషల్ మీడియా హ్యాండిల్స్ గుస్సా అయ్యాయ్.
‘వెయిట్ అండ్ సీ’ అంటూ ఉదయ నిధి స్టాలిన్, మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ విషయమై చేసిన వ్యాఖ్యలతో వివాదం మరింత ముదిరి పాకాన పడింది. పవన్ కళ్యాణ్‌ని అత్యంత జుగుప్సాకరంగా ట్రోల్ చేస్తూ, సనాతన ధర్మంపై విషం చిమ్మేందుకు ప్రయత్నించిన డీఎంకే సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద జనసేన మద్దతుదారులైన నెటిజన్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు.
ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, డీఎంకే నెటిజన్స్‌కి తమిళంలోనే జనసేన మద్దతుదారులు కౌంటర్ ఎటాక్ ఇవ్వడం. అదే సమయంలో, జనసేన మద్దతుదారులైన నెటిజన్లు, పవన్ కళ్యాణ్ మీదా సనాతన ధర్మం మీదా దుష్ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా హ్యాండిల్స్‌ని టార్గెట్ చేశారు. వాటిపై రిపోర్ట్స్ కొట్టడం కూడా ఓ ఉద్యమంలా చేశారు.
అంతే, కొన్ని పెద్ద హ్యాండిల్స్ తొలుత ‘లాక్’ చేసుకుని సైలెంట్ అయిపోగా, ఆ తర్వాత అవి డి-యాక్టివేట్ కూడా అయిపోయాయి. మరోపక్క, సనాతన ధర్మంపైనా అలాగే పవన్ కళ్యాణ్ మీదా జుగుప్సాకరమైన రీతిలో ట్రోలింగ్ చేసిన సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై పోలీసులకు ఫిర్యాదులు చేయడంలోనూ జనసేన మద్దతుదారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు.
కేవలం జనసేన మద్దతుదారులే కాకుండా, సనాతన ధర్మం విషయమై పవన్ కళ్యాణ్‌కి అండగా నిలుస్తున్న దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందినవారు కూడా, డీఎంకే హ్యాండిల్స్‌పై తమ తమ రాష్ట్రాల్లో ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారు. నిజానికి, ఈ తరహా స్పందనను జనసేన పార్టీ కూడా ఊహించి వుండదు.