లైగర్ పూర్తవవుతుండగానే పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కలిసి మరో చిత్రం చేస్తున్నట్లు ప్రకటించారు. పూరి జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన ను విజయ్ తో చేయాలని ఫిక్స్ అయ్యాడు. గత నెల ముంబైలో గ్రాండ్ గా చిత్రం లాంచ్ అయింది కూడా. ఆ తర్వాత మళ్ళీ ఈ చిత్రం మీద అప్డేట్ లేదు.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం కాశ్మీర్ లో తన తర్వాతి చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి ఖుషీ టైటిల్ ను ఫిక్స్ చేసారు కూడా.
ఇదిలా ఉంటే జనగణమన చిత్రానికి సంబంధించిన కీ అప్డేట్ బయటకు వచ్చింది. జులై చివరి వారంలో ఈ చిత్ర షూటింగ్ స్టార్ట్ అవుతుందిట. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనున్న పూజ హెగ్డే కూడా జులై ఆఖరి వారం నుండి డేట్స్ ను కేటాయిస్తుండడంతో రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టడానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.