సైబరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జనసేన సభ్యత్వ జోరు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,073FansLike
57,764FollowersFollow

తెలంగాణ పరిధిలో విలీన ప్రక్రియ అనంతరం కొత్తగా నిర్ణయించిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ప్రాంతంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో జనసేన ప్రధాన నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులకు ప్రత్యేక అవగాహన సమావేశం ఈరోజు సాయంత్రం కూకట్‌పల్లి జనసేన కార్యాలయంలో జరిగింది.

ఈ సమావేశానికి సైబరాబాద్ పరిధిలోని అన్ని డివిజన్ల నుంచి జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసేన వీర మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కొత్తగా ఏర్పడిన CMC పరిధిలో పార్టీ బలపర్చడం లక్ష్యంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయాలని నాయకత్వం పిలుపునిచ్చింది.

సభ్యత్వ నమోదు ప్రాధాన్యత, నమోదు విధానం, ఎదురయ్యే సాంకేతిక అంశాలపై ప్రేమ్ కుమార్ కార్యకర్తలకు వివరంగా అవగాహన కల్పించారు. ప్రతి డివిజన్ నుంచి కనీసం ఐదు వేల మందిని సభ్యులుగా చేర్చే అవకాశముందని, జనసైనికులు ఆ దిశగా లక్ష్యంతో పని చేయాలని సూచించారు. పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ, అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా ప్రాధాన్యత గల నాయకుడిగా ఎదిగిన విధానాన్ని ప్రస్తావించారు. సనాతన ధర్మ పరిరక్షణలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆయనకు అన్ని రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారని తెలిపారు. జనసేన కేవలం ఒక రాష్ట్రానికి పరిమితమైన పార్టీ కాదని, సభ్యత్వ నమోదు విషయంలో ప్రాంతం ఎలాంటి అడ్డంకి కాదని కార్యకర్తలకు ధైర్యం నూరిపోశారు.

క్షేత్ర స్థాయిలో అందరూ కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరాన్ని ప్రేమ్ కుమార్ స్పష్టం చేశారు. ఒక్కో నాయకుడు మరింత మంది నాయకులను తయారు చేయాలని, అన్ని బాధ్యతలను తానే తీసుకోవాలని భావిస్తే ఫలితం ఉండదని చెప్పారు. విస్తృత స్థాయిలో నాయకత్వ వికాసం జరగాలని సూచించారు.

సభ్యత్వ నమోదు సమయంలో ఇప్పటికే చేర్చిన సభ్యులకు ఇన్సూరెన్స్ విషయంలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని కార్యకర్తలు తెలియజేశారు. దీనిపై స్పందించిన ప్రేమ్ కుమార్, ఇకపై అలాంటి సమస్యలు ఉండకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇన్సూరెన్స్ లబ్ధిదారులకు సహాయం అందేవరకు స్థానిక నాయకులు కూడా బాధ్యతగా ఫాలోఅప్ చేయాలని సూచించారు.

కొత్త సభ్యత్వ నమోదు ప్రక్రియలో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులకు పరిష్కారం చూపేందుకు ఇప్పటికే ఐటీ టీమ్ పని చేస్తున్నదని తెలిపారు. అన్ని డివిజన్లలో ఉత్సాహంతో ముందుకు సాగి భారీ సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేయాలని జనసైనికులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్  నాయకులు  బొర్రా వెంకట అప్పారావు, కుత్బుల్లాపూర్ జనసేన పార్టీ ఇంచార్జి  నందగిరి సతీష్, పటాన్ చెరు పార్టీ ఇంచార్జి రాజేష్, మణికొండ పార్టీ ప్రతినిధి శ్రీనివాస్ లు  ప్రసంగించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచనలు అందించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జనసేన పార్టీ విస్తరణకు ఇది కీలక దశగా నాయకులు అభిప్రాయపడ్డారు.

సినిమా

“మంగ్లీ కేసు ట్విస్ట్… ఆరోపణలకు కౌంటర్ స్టేట్‌మెంట్!”

హైదరాబాద్‌లో ప్రముఖ గాయని Mangli చుట్టూ కొనసాగుతున్న వివాదం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఆమె Panjagutta Police Station ను ఆశ్రయించి సింగపోగు సుబ్బు అనే...

Stand-up Comedian Anudeep: అనుదీప్ క్షమాపణలు.. శాంతించని అభిమానులు

Stand-up Comedian Anudeep: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్‌, రామ్ చరణ్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నిహారికలపై స్టాండప్ కమెడియన్...

Stand-up comedy: పవన్-బాలకృష్ణ-రామ్ చరణ్-ఎన్టీఆర్-నిహారిక.. నవ్వు పేరుతో బాధితులే

Stand-up comedy: మనసుకి ఉల్లాసాన్నిచ్చేది హాస్యం కానీ, మనసుల్ని కించపరిచేది కాదు. మనుషుల్ని నవ్వించేది హాస్యం కానీ, మనుషుల్ని బాధించేది హాస్యం కాదు. నీ వ్యక్తిత్వం...

“10 రోజుల్లోనే 10 మిలియన్ వ్యూస్”: ‘గురుతుందా..’ సాంగ్ సెన్సేషన్

యువ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా తెరకెక్కుతున్న చెన్నై లవ్ స్టోరీ సినిమా ఇప్పటికే బిజినెస్ పరంగా మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది....

Vishnu Priya: చిక్కుల్లో నటి విష్ణుప్రియ..! ఆమెపై క్రిమినల్ కేసు నమోదుకు...

Vishnu Priya: సినీ నటి, బుల్లితెర యాంకర్ విష్ణుప్రియపై పోలిస్ కేసు నమోదయింది. ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా ఆమె చేస్తున్న పబ్లిసిటీ యువతను పెడదోవ పట్టించేలా...

రాజకీయం

“రక్త చరిత్రే రాజకీయం..!” వైసీపీపై నిమ్మల తీవ్ర ఆరోపణలు

ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. రక్త చరిత్రనే రాజకీయం గా మార్చుకుని వైసీపీ ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రత్యేకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డ...

రోడ్డు కట్‌పై రచ్చ… నాణ్యతా పరీక్షలే అంటూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ

రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై జరుగుతున్న ప్రచారాలపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది. కొన్ని వర్గాలు, అనుకూల మీడియా సంస్థలు రోడ్లలో కనిపిస్తున్న కట్‌లను నిర్మాణ లోపాలుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని...

“వైఎస్ మరణంపై అనుమానాలు ఇప్పుడు నిజమై కనిపిస్తున్నాయి”: అచ్చెన్నాయుడు

అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై గతంలో వ్యక్తమైన అనుమానాలు ఇప్పుడు నిజమనే భావన కలుగుతోందని ఆయన...

“ట్రెండ్ కాదు.. లక్ష్యమే ముఖ్యం”: యువతకు లోకేష్ సందేశం

బెంగళూరులో నిర్వహించిన గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి...

“జగన్‌లో గన్.. అవినాష్‌లో వినాశనం”: అనంతపురంలో షర్మిల ఘాటు వ్యాఖ్యలు

అనంతపురంలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ Y. S. Sharmila Reddy తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ సిద్ధాంతం మొత్తానికి “నరకాలి, చంపాలి, నాశనం చేయాలి” అనే...

ఎక్కువ చదివినవి

“థియేటర్ టెంపుల్… ప్రేక్షకులు గాడ్స్” — శర్వానంద్ మాటలో తప్పేముంది?

శర్వానంద్ ఇటీవల Biker విజయోత్సవ సభలో భావోద్వేగంతో “థియేటర్ టెంపుల్… ప్రేక్షకులు గాడ్స్” అన్నాడు. కొంతమంది దానిని వెంటనే పట్టుకుని చర్చలు, ట్రోల్స్ మొదలుపెట్టారు. కానీ ఒకసారి ఆ మాట వచ్చిన సందర్భం కూడా చూడాలి. ఎన్నో...

ఒక్క ఛాన్స్ ప్లీజ్.. పల్లవి గౌడ్ విజ్ఞప్తి

తెలంగాణకు చెందిన అచ్చ తెలుగు ఆడపడుచు పల్లవి గౌడ్ ఇప్పుడు సినిమా రంగంలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. చిన్నప్పటి నుంచి తనలో దాగి ఉన్న కళాప్రేమను ఇన్నాళ్లు కుటుంబ...

Daily Horoscope: వృషభానికి ఆర్థిక లాభ సూచనలు… ధనుస్సుకు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం

ఏప్రిల్ 12 , 2026 ఆదివారం రాశిఫలాలు ఈరోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహాల సంచారం కొన్ని రాశులకు అనుకూలంగా ఉండగా, మరికొన్ని రాశులకు జాగ్రత్త అవసరం సూచిస్తోంది. ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబ...

Akira Nandan: అకీరా ఎంట్రీకి టైమ్ వచ్చిందా?

Akira Nandan: మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పేరు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది — అకీరా నందన్. పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్,...

“10 రోజుల్లోనే 10 మిలియన్ వ్యూస్”: ‘గురుతుందా..’ సాంగ్ సెన్సేషన్

యువ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా తెరకెక్కుతున్న చెన్నై లవ్ స్టోరీ సినిమా ఇప్పటికే బిజినెస్ పరంగా మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. కలర్ ఫొటో, బేబి వంటి కల్ట్...