స్థానిక ఎన్నికలపై జనసేన ఫోకస్.. వార్డుల పునర్విభజనపై కీలక చర్చలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

92,672FansLike
57,764FollowersFollow

రానున్న పురపాలక, నగరపాలక సంస్థలు మరియు నగర పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ కార్యాచరణను వేగవంతం చేసింది. వార్డులు, డివిజన్ల పునర్విభజనతో పాటు స్థానిక రాజకీయ పరిస్థితులపై సమగ్రంగా చర్చించేందుకు జనసేన పార్టీ ప్రత్యేక కమిటీ గురువారం విజయవాడలో సమావేశమైంది. జనసేన పార్టీ పి.ఏ.సీ ఛైర్మన్‌, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి Nadendla Manohar అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగానే క్షేత్ర స్థాయి పరిస్థితులను అంచనా వేయాలని భావించిన జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా-గుంటూరు, ప్రకాశం-నెల్లూరు-రాయలసీమ ప్రాంతాలకు వేర్వేరు కమిటీలు పర్యటించి, ఆయా ప్రాంతాల్లో పెరగనున్న వార్డులు, డివిజన్లు, స్థానిక రాజకీయ పరిస్థితులపై అధ్యయనం నిర్వహించాయి.

ఈ పర్యటనల్లో భాగంగా జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులతో కమిటీ సభ్యులు సమావేశమై అభిప్రాయాలు సేకరించారు. ప్రాంతాలవారీగా సిద్ధం చేసిన నివేదికలను సమావేశంలో నాదెండ్ల మనోహర్‌కు అందజేశారు. కూటమి స్ఫూర్తిని కొనసాగిస్తూ స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, సమన్వయంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.

ఈ సమావేశంలో చర్చించిన అంశాలు, కమిటీ సభ్యులు సమర్పించిన నివేదికలను త్వరలోనే పవన్ కళ్యాణ్‌కు నివేదించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశంలో కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేశ్ బాబు, వంశీకృష్ణ, పంతం నానాజీ, బొలిశెట్టి శ్రీనివాస్, కొటికలపూడి గోవిందరావు, సామినేని ఉదయభాను, బాలినేని శ్రీనివాసరెడ్డి, టి.సి. వరుణ్, ఆరణి మదన్, పిడుగు హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సినిమా

ఒకే ఏడాదిలో రూ.300 కోట్ల మైలురాయి.. బాక్సాఫీస్ చరిత్రలో చిరంజీవి–రామ్ చరణ్...

బాక్సాఫీస్ చరిత్రలో కలెక్షన్ల గురించి మాట్లాడితే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేర్లు మరోసారి ప్రత్యేకంగా నిలిచే పరిస్థితి కనిపిస్తోంది. ఒకే...

పెద్ది దూకుడు కొనసాగుతోంది.. 11వ రోజు ఆల్‌టైమ్ టాప్-6లో ఎంట్రీ!

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. విడుదలైన 11వ రోజు ఏపీ-తెలంగాణలో...

సొంత ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. 180 మంది...

హీరో విజయ్ దేవరకొండ తన సొంత ప్రాంతానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ విద్యారంగంలో మరో ప్రశంసనీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో...

అచ్చంపేట వేదికగా విజయ్-రష్మిక మధుర క్షణాలు.. సోషల్ మీడియాలో ‘కపుల్ గోల్స్’...

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమం కోసం అచ్చంపేటకు వెళ్లిన సినీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించారు....

బుచ్చిబాబు క్షమాపణలపై అనంత శ్రీరామ్ వ్యాఖ్యలు.. ఆసక్తికర చర్చకు దారితీసిన స్పందన

పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన వివాదం నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు చేసిన క్షమాపణలపై ప్రముఖ గేయరచయిత అనంత శ్రీరామ్ స్పందించారు. ఈ విషయంపై...

రాజకీయం

అమరవీరులకు పవన్ కళ్యాణ్ నివాళి.. నేషనల్ వార్ మెమోరియల్‌లో భావోద్వేగ క్షణాలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు  పవన్ కళ్యాణ్ ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. భారత సైనికుల ధైర్యం,...

ఢిల్లీలో జనసేన సేన ప్రస్థానం.. అయిదు కీలక తీర్మానాలకు ఆమోదం

జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన ‘సేన ప్రస్థానం – దేశ సమైక్యత కోసం’ సమావేశంలో ఐదు కీలక తీర్మానాలకు ఆమోదం లభించింది....

తప్పుడు ప్రచారమా?.. డీఎస్సీ నియామకాలపై కొత్త వివాదం

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామకాల అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. డీఎస్సీ నియామకాల్లో కుల ప్రాధాన్యతకు సంబంధించిన ఆరోపణలు, ప్రత్యారోపణలు రాజకీయ వర్గాల్లో వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా కింద జరిగిన...

దేశ సమగ్రతే జనసేన లక్ష్యం.. ఢిల్లీలో పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ

ఢిల్లీ వేదికగా జనసేన పార్టీ నిర్వహించిన ‘సేన ప్రస్థానం.. జాతీయ సమైక్యత కోసం’ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి...

సేన ప్రస్థానం.. జాతీయ సమైక్యత కోసం: ఢిల్లీలో జనసేన కీలక సమావేశం

జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. "సేన ప్రస్థానం... జాతీయ...

ఎక్కువ చదివినవి

మహేష్ బాబు ప్రశంసలతో ‘రావు బహదూర్’ టీజర్.. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల

సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు చిత్రం ‘రావు బహదూర్’ టీజర్ తాజాగా విడుదలై సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ‘సి/ఓ కంచరపాలెం’ చిత్రంతో ప్రశంసలు అందుకున్న వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తున్న...

Chiranjeevi: ‘ఆయన తెలుగు సినిమా భీష్మాచార్యుడు’.. ‘సింగ్ గీతం’కు చిరంజీవి ప్రశంస

Chiranjeevi: ప్రముఖ సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావును తెలుగు సినిమా భీష్మాచార్యుడిగా అభివర్ణించారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సింగ్ గీతం’. మరో స్టార్ డైరక్టర్ నాగ్ అశ్విన్ ఈ...

ఎల్జీ బాధితులకు పరిహారం ఇచ్చిందెవరు?.. కూటమి సర్కార్‌తో నెరవేరిన న్యాయం

విశాఖలో 2020లో జరిగిన ఎల్జీ పాలిమర్స్ స్టైరీన్ గ్యాస్ లీక్ ఘటన రాష్ట్రాన్ని కుదిపేసిన విషాదాల్లో ఒకటిగా నిలిచింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది తీవ్ర ఆరోగ్య...

Peddi: అవును.. ‘పెద్ది’లో ఆ సన్నివేశాలు తొలగించాం: బుచ్చిబాబు

Peddi: రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' సంచలన విజయం సాధించి మంచి వసూళ్లు రాబడుతోంది. అయినా, సినిమాపై సోషల్ మీడియాలో కొన్ని విమర్శలు రావడం చిత్ర యూనిట్ ను నిరాశపరచింది. పరిచయ...

బుచ్చిబాబు క్షమాపణలపై అనంత శ్రీరామ్ వ్యాఖ్యలు.. ఆసక్తికర చర్చకు దారితీసిన స్పందన

పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన వివాదం నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు చేసిన క్షమాపణలపై ప్రముఖ గేయరచయిత అనంత శ్రీరామ్ స్పందించారు. ఈ విషయంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్...