ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా మరోసారి సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ఆర్‌సీపీ నేత ఆరే శ్యామల చేసిన వ్యాఖ్యలకు జనసేన నుంచి దిమ్మదిరిగే స్థాయిలో ఘాటైన కౌంటర్ రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది.
కులం, మతం, లడ్డు, కల్తీ, నెయ్యి వంటి అంశాలతో రెండేళ్లుగా ప్రజల దృష్టిని మళ్లించారని ఆరే శ్యామల విమర్శించారు. సంక్షేమం, అభివృద్ధి, మహిళా రక్షణ, విద్య, వైద్యం, సేద్యం, ఉద్యోగాల కల్పన వంటి కీలక అంశాలపై చర్చ జరగకుండా చేశారని ఆరోపించారు. ఆమె వ్యాఖ్యల్లో పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్‌పై వ్యంగ్య స్వరాలు వినిపించాయి.
అయితే ఈ వ్యాఖ్యలకు జనసేన శతఘ్ని టీం నుంచి వచ్చిన సమాధానం రాజకీయ వేడి పెంచింది. పవిత్ర ప్రసాదం కల్తీ అయితే ప్రశ్నించకూడదా అని ప్రశ్నిస్తూ, దానిని కులం, మతం పేరుతో మసకబార్చడం సరికాదని స్పష్టం చేసింది. పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి ని వీడియో ద్వారా చెప్పారు. ప్రజా పదవులు విమర్శల కోసం కాదని, బాధ్యతతో వ్యవహరించాలంటూ గట్టిగా హెచ్చరించింది. పార్టీకి ఉపయోగపడేలా పనిచేయాలని, అప్రాసంగిక వ్యాఖ్యలు చేయవద్దని కఠినంగా స్పందించింది.
ఈ కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ చర్చ మరింత మసాలా దిశగా మలుపు తిరిగింది. లడ్డు వివాదం చుట్టూ మళ్లీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం జరిగిన విషయాన్ని నివేదికలతో స్పష్టం చేస్తుండగా, మరోవైపు ప్రతిపక్షం విమర్శలతో దాడి చేస్తోంది. కానీ తాజా పరిణామంలో జనసేన ఇచ్చిన రిప్లయ్ రాజకీయ వేదికపై గట్టి సందేశం ఇచ్చిందని పరిశీలకులు భావిస్తున్నారు.
సోషల్ మీడియా యుద్ధాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధాన ఆయుధంగా మారాయి. ఒక కామెంట్‌కు మరో కౌంటర్ వెంటనే వస్తోంది. తాజా ఘటనలో జనసేన ఇచ్చిన దిమ్మదిరిగే సమాధానం రాజకీయ చర్చను కొత్త దిశలోకి నెట్టింది.
pic.twitter.com/9dcn0Y0rj0
మీ విజ్ఞాన ప్రదర్శనలు మీ అధినేత దగ్గర చూపెట్టుకోండి ఇక్కడ కాదు @AreSyamalaమీకు పదవి ఇచ్చింది పార్టీకి ఏమైనా పనికొస్తారేమో అని కానీ ఇలాంటి సోది కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతారు అని కాకపోవచ్చు!
అందుకు సాక్షి ఉంది, సాక్షి పని మీరు చేయనక్కర్లేదు.అయినా ఇదేమీ… https://t.co/shTXHpFOfj
— JanaSena Shatagni (@JSPShatagniTeam) February 27, 2026

