Switch to English

జేమ్స్ మూవీ రివ్యూ – అప్పు ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow
Movie జేమ్స్
Star Cast పునీత్ రాజ్ కుమార్, ప్రియా ఆనంద్, శ్రీకాంత్, శరత్ కుమార్, అను ప్రభాకర్
Director చేతన్ కుమార్
Producer కిషోర్ పత్తికొండ
Music చరణ్ రాజ్
Run Time 2 గంటల 29 నిముషాలు
Release 17 మార్చ్, 2022

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం జేమ్స్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పునీత్ ను ఆఖరి సారి సిల్వర్ స్క్రీన్ మీద చూసేందుకు ఆయన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో జేమ్స్ ఎలా ఉందో చూద్దామా.

కథ:

సంతోష్ కుమార్ (పునీత్ రాజ్ కుమార్) ప్రైవేట్ ఏజెన్సీలో ఒక సెక్యూరిటీ ఏజెంట్. ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ విజయ్ గయక్వాడ్ (శ్రీకాంత్)కు బాడీ గార్డ్ గా జాయిన్ అవుతాడు. అయితే అనూహ్య పరిస్థితుల్లో విజయ్ గయక్వాడ్ కే ఎదురు తిరుగుతాడు సంతోష్ కుమార్.

ఒక నిజాయితీ పరుడైన సెక్యూరిటీ ఏజెంట్, ఒక పెద్ద వ్యాపారవేత్తకు ఎందుకు ఎదురుతిరగాల్సి వచ్చింది? అసలు సంతోష్ ఎవరు? ఇవి తెలిసేందుకు సినిమా చూడాల్సిందే.

పెర్ఫార్మన్స్:

ఇది నిజంగా పునీత్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. పునీత్ ఈ చిత్రంలో అన్ని రకాలుగా మెప్పిస్తాడు. జేమ్స్ లో అత్యంత స్టైలిష్ గా కనిపించాడు. అలాగే ఎమోషనల్ సీన్స్ లో డీసెంట్ గా చేసిన పునీత్, యాక్షన్ సన్నివేశాల్లో చెలరేగిపోయాడు. ఇక డ్యాన్స్ మూవ్స్ పరంగా పేరు పెట్టడానికి లేదు. తన 100 శాతం ఇచ్చాడు. మొత్తానికి ఆల్ రౌండ్ పెర్ఫార్మన్స్ తో పునీత్ తన ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇచ్చాడనే చెప్పాలి.

ప్రియా ఆనంద్ క్యూట్ గా ఉంది. పునీత్ తో ఆమె కెమిస్ట్రీ కూడా భలే వర్కౌట్ అయింది. అయితే ఆమె పాత్రను మరింత బాగా తీర్చిదిద్దవచ్చు అనిపిస్తుంది. ఇండస్ట్రియలిస్ట్ పాత్రలో శ్రీకాంత్ బాగానే చేసాడు. మెయిన్ విలన్ గా శరత్ కుమార్ కూడా ఓకే.

ఇక పునీత్ తో పాటు శివ రాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్ లను ఒకేసారి చూడటం రాజ్ కుమార్ కుటుంబ అభిమానులకు ఫుల్ ట్రీట్ అని చెప్పాలి. ఈ సన్నివేశం కూడా భలే సెట్ అయింది సినిమాలో.

సాంకేతిక వర్గం:

సాంకేతికంగా జేమ్స్ బలంగా నిలిచింది. చరణ్ రాజ్ అందించిన సంగీతం మెప్పిస్తుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు. స్వామి జె గౌడ అందించిన సినిమాటోగ్రఫీ కూడా టాప్ క్లాస్ గా అనిపిస్తుంది. డార్క్ వరల్డ్ ను చూపించే సన్నివేశాల్లో లైటింగ్ సూపర్బ్ గా సెట్ అయింది. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. నిర్మాణ విలువలు అదిరిపోయాయి.

చేతన్ కుమార్ రూపొందించిన కథ జస్ట్ ఓకే అనిపిస్తుంది. రొటీన్ ఫార్మాట్ స్టోరీని డిఫరెంట్ సెటప్ తో తీసాడు. స్క్రీన్ ప్లే పరంగా కొన్ని లూప్ హొల్స్ ఉన్నాయి. యాక్షన్ పార్ట్ పరంగా అద్భుతంగా డిజైన్ చేసుకున్నాడు ఎపిసోడ్స్. సినిమాను కూడా స్టైలిష్ గా ప్రెజంట్ చేసాడు. అయితే కథా కథనాలపై మరింత దృష్టి పెట్టి ఉంటే జేమ్స్ నిజంగా వేరే లెవెల్ లో ఉండేది.

ప్లస్ పాయింట్స్:

  • పునీత్ రాజ్ కుమార్
  • నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్:

  • స్క్రీన్ ప్లే
  • యాక్షన్ కే పెద్ద పీట వేయడం

చివరిగా:

జేమ్స్ ఒక రెగ్యులర్ యాక్షన్ డ్రామా. అయితే ఈ చిత్రం పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా కాబట్టి స్పెషల్ గా అనిపిస్తుంది. పునీత్ కూడా సినిమా పరంగా 100 శాతం ఇచ్చాడు. అన్ని రంగాల్లో ఫ్యాన్స్ ను సంతృప్తి పరచడానికి చూసాడు. ఫ్యాన్స్ కోసం ఇంతలా పరితపించే నటుడు ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం.

* పునీత్ మన మధ్య లేని కారణంగా, ఆయన గౌరవార్ధం ఈ చిత్రానికి రేటింగ్ ఇవ్వడం లేదు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న టిల్లు స్క్వేర్ పై అంచనాలు పెరుగుతూనే...

BJP: ‘ఆ హీరోకి ఫాలోయింగ్ ఎక్కువ.. సినిమాలు ఆపండి’ ఈసీకి బీజేపీ లేఖ

BJP: కర్ణాటక (Karnataka) లో రాజకీయం రసవత్తరంగా మారింది. 2019లో రాష్ట్రంలోని 28 పార్లమెంట్ స్థానాలకు 25 స్థానాలు గెలుచుకున్న బీజేపీ (BJP) మళ్లీ తన మ్యాజిక్ చూపాలని ప్రయత్నిస్తోంది. అయితే.. అధికారంలో...

Ram Charan Birthday special: మిస్టర్ కూల్.. ‘రామ్ చరణ్’

Ram Charan: రంగం ఏదైనా రాణించేందుకు ప్రతిభతోపాటు నడవడిక, క్రమశిక్షణ, నిబద్దత మరీ ముఖ్యం. ఇవే ఒక వ్యక్తిని కొలిచే కొలమానాలు. ప్రతిభతో రాణించొచ్చు కానీ గౌరవం దక్కించుకోలేం. ఇవన్నీ ఉంటే అతడు...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొంది. మే 9న...

కవిత, కేజ్రీవాల్.. తర్వాత అరెస్టయ్యేదెవరు.?

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు.. ఇంకో సంచలనం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీయార్ కుమార్తె కవిత...