Jailer: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) రీసెంట్ బ్లాక్ బస్టర్ జైలర్ (Jailer) సృష్టించిన సంచలనాలు తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dileep Kumar) దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ ప్రపంచవ్యాప్తంగా జైలర్ రూ.600కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ (Sun Pictures) సైతం వెల్లడించింది. అంతటా అద్భుతాలు చేసిన జైలర్ ఇప్పుడు మలేసియా మార్కెట్ లో సైతం కలెక్షన్ల ప్రభంజనాన్ని సృష్టించింది. ఈ మేరకు సినిమాను మలేషియాలో పంపిణీ చేసిన అయ్యంగరన్ ఇంటర్నేషనల్ సంస్థ సోషల్ మీడియాలో వెల్లడించింది.
‘జైలర్ మలేషియాలో టాప్ ఇండియన్ మూవీగా నిలిచింది. 2015లో వచ్చిన షారుఖ్ ఖాన్ “దీవాలే” ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఉంది. దీనిని జైలర్ అధిగమించి తొలి స్థానంలో నిలిచింద’ని పేర్కొంది. అయితే.. వసూళ్లు ఎంత అనేది తెలపలేదు. జైలర్ అద్భుత విజయం సాధించడంతో సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ఇటివలే రజినీకాంత్, నెల్సన్, అనిరుధ్ కు విలువైన కార్లు, టీమ్ కు గోల్డ్ కాయిన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే.