Jailer 2: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా 2023లో వచ్చిన జైలర్ సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించింది. అనిరుధ్ సంగీతం సినిమాకు హైలైట్ గా నిలిచింది. సినిమాకు సీక్వెల్ తెరెకెక్కుతుందని కొన్నాళ్లుగా వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ సీక్వెల్ కన్ఫర్మ్ చేసింది టీమ్.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రజినీకాంత్ అభిమానులకు అనౌన్స్ మెంట్ టీజర్ తో గుడ్ న్యూస్ చెప్పింది సన్ పిక్చర్స్. దర్శకుడు నెల్సన్, సంగీత దర్శకుడు అనిరుధ్ మాట్లాడుకుంటూండగా రజినీకాంత్ వచ్చి తన హీరోయిజం చూపిస్తూ విలన్లను అంతమొందించే సన్నివేశాన్ని భారీ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ యాక్షన్ నేపథ్యం ఆకట్టుకుంటోంది.
రజినీకాంత్ చాలా ఫెరోషియస్ గా కనిపించారు. సినిమాలో ఆయన మార్క్ మేనరిజం.. ‘టైగర్ కా హుకుమ్..’ డైలాగ్ రావడం మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. అనిరుధ్ బీజీఎమ్ కూడా ఇందుకు తోడైంది. షూటింగ్, నటీనటుల వివరాలు త్వరలో తెలియజేస్తారని తెలుస్తోంది.