Switch to English

జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్.. ఇదోరకం యాపారం.!

ప్రైవేటు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద భూములు (నివాస స్థలాలు) కొనుగోలు చేస్తే అనేక సమస్యలొస్తాయ్.. అదే ప్రభుత్వం దగ్గర వాటిని కొంటే, వివాదాలకు ఆస్కారం వుండదు. నిజానికి, మంచి ఆలోచనే ఇది. ఈ విషయంలో వైఎస్ జగన్ సర్కారుని అభినందించకుండా వుండలేం. కానీ, ఇక్కడ వైఎస్ జగన్ చేస్తున్నది వ్యాపారం.

ప్రజలు తమ సొమ్ముతో ప్లాట్లను కొనుగోలు చేస్తోంటే, దానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు పెట్టడమేంటి.? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంటుంది. ప్రైవేటు టౌన్ షిప్స్ ఎలాగైతే, తమ సంస్థల పేర్లను ఆయా వెంచర్లకు పెడుతుంటాయో.. ఇక్కడ, ప్రభుత్వం కూడా అలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు పెడుతోందన్నమాట.

ఇంతకీ, ప్రభుత్వ లే ఔట్లలో భూములు కొనే ప్రజలకు అదనపు ప్రయోజనాలు ఏముంటాయట.? ఈ విషయమై భిన్న వాదనలున్నాయి. మార్కెట్ రేటు కంటే తక్కువకు ప్రభుత్వం భూములు అమ్మే పరిస్థితి వుండదు. అలా చేస్తే, ఖజానాకి నష్టం కలుగుతుంది. అంటే, మళ్ళీ ఆ భారం ప్రజల మీదనే పడుతుంది.

ఇక, లే ఔట్లలో అభివృద్ధి.. అంటే, దానికి మళ్ళీ ప్లాట్ల యజమానుల నుంచే ఏదో ఒక రూపంలో వసూళ్ళు తప్పవు. ఎలా చూసినా, జగనన్న స్మార్ట్ టౌన్ షిప్.. అంటే, ఇదొక ‘యాపారం’ తప్ప, ఇందులో ప్రజా ప్రయోజనమేదీ ఇసుమంత కూడా వుండదన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన.

ఎవరి గోల వారిది. జగనన్న గోరు ముద్ద.. జగనన్న కాలనీలు.. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్.. ఎలా ఎటు చూసినా, అంతా జగన్మాయ.. ఇంకెందుకు, ఆంధ్రప్రదేశ్ పేరు కూడా మార్చేసి.. జగనన్న ప్రదేశ్.. అని పెట్టేస్తే పోలా.? అంటూ సోషల్ మీడియా వేదికగా మీమ్స్ పడుతున్నాయి. ఏమో, ఆ ముచ్చట కూడా ముందు ముందు చూడబోతామేమో.!

రెండున్నరేళ్ళయ్యింది.. ఆంధ్రప్రదేశ్ రాధాని విషయమై గందరగోళానికి తెరలేచి. ఇప్పటిదాకా రాజధాని పేరుతో కొత్తగా ఒక్క ఇటుక అటు విశాఖలోగానీ, ఇటు కర్నూలులోగానీ.. ఏకైక రాజధాని అమరావతిలోగానీ పడింది లేదు. మరెలా, ప్రభుత్వం వెంచర్లు వేసేసి.. ప్రజలకోసం జగనన్న స్మార్ట్ టౌన్ షిప్‌లను నిర్మించేస్తుంది.? ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే.

చంద్రబాబు హయాంలో అమరావతి రాజధాని అయ్యింది.. దాన్ని వైఎస్ జగన్ సర్కారు ఆపేసింది. మరి, వైఎస్ జగన్ హయాంలో ప్రకటితమవుతున్న జగనన్న కాలనీలు, జగనన్న స్మార్ట్ టౌన్ షిప్‌లు తర్వాత వచ్చే ప్రభుత్వ హయాంలో కొనసాగుతాయని ఎలా అనుకొగలం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నా పెళ్లి విడాకులు అన్ని కూడా యూట్యూబ్‌ లో చేస్తున్నారు

ప్రముఖ నటి మరియు సోషల్ మీడియా స్టార్‌ హిమజ పెళ్లి అయ్యింది.. తాజాగా విడాకులు తీసుకుందంటూ మీడియా లో వార్తలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తలతో...

గుడ్ లక్ సఖి రివ్యూ : రొటీన్ స్పోర్ట్స్ డ్రామా

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందించిన గుడ్ లక్ సఖి పలు మార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన...

విజయ్ చిత్రానికి భారీ ఆఫర్ ఇస్తోన్న జీ సంస్థ

ఇళయథళపతి విజయ్ తన కెరీర్ లో తొలిసారి  డైరెక్ట్ తెలుగు చిత్రం చేయబోతున్నాడు. విజయ్ 66వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనుండగా అగ్ర నిర్మాత...

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న గంగూభాయ్

ఆర్ ఆర్ ఆర్ లో హీరోయిన్ గా నటించిన అలియా భట్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం గంగూభాయ్ కథియావాడి. గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన...

శ్రీ విష్ణు మాస్ టచ్ తోనైనా మెప్పిస్తాడా?

శ్రీ విష్ణు సినిమా వస్తోందంటే కచ్చితంగా చిత్రంలో ఏదో కొత్తదనం  ఉంటుందన్న అభిప్రాయం చాలా మంది ప్రేక్షకుల్లో ఉంది. అయితే గత కొంత కాలంగా శ్రీ...

రాజకీయం

జిల్లాల రగడ: ఇది బులుగు వ్యూహం కాదు కదా.?

వైఎస్ జగన్ సర్కారు రాష్ట్రంలో 26 జిల్లాల ఏర్పాటు దిశగా ముందడుగు వేసిన విషయం విదితమే. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభం కానుంది. మరోపక్క, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని...

రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పిన సోము వీర్రాజు

‘రాయలసీమలో ఎయిర్ పోర్టు.. కడపలో ఎయిర్ పోర్టు.. ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్ పోర్ట.. వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన...

కేసీయార్ వ్యతిరేకిస్తే.. వైఎస్ జగన్ స్వాగతించేశారు.!

రాష్ట్ర ప్రభుత్వ అభీష్టంతో సంబంధం లేకుండా రాష్ట్ర క్యాడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారుల్ని డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుకి పిలిపించుకునే అధికారాన్ని కేంద్రానికి కట్టబెడుతూ సర్వీస్ నిబంధనల్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం...

సూపర్‌ స్టార్‌ రాజకీయాల్లోకి.. ఇదే సంకేతం అంటున్న ఫ్యాన్స్‌

తమిళ సినిమా ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం కొత్తేం కాదు. ఎంజీఆర్ మొదలుకుని ఎంతో మంది ఇండస్ట్రీకి చెందిన వారు రాజకీయాల్లోకి అడుగులు వేశారు. జయలలిత హీరోయిన్ గా ఎంతగానో పేరు సాధించి ముఖ్యమంత్రిగా...

కొత్త జిల్లాల వ్యవహారం ఒక డ్రామా : చంద్రబాబు

రాష్ట్రంలో ఉన్న సమస్యలను పక్క దారి పట్టించేందుకు.. ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇప్పుడు కొత్త జిల్లాల ప్రస్థావన తీసుకు వచ్చారంటూ తెలుగు దేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించాడు....

ఎక్కువ చదివినవి

మళ్లీ తెరపైకి ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజన..!

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి రెండు రోజుల్లో వెలువరించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. అయితే.. 2021కి జనాభా...

రాశి ఫలాలు: శుక్రవారం 28 జనవరి 2022

పంచాంగం శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం బహుళపక్షం సూర్యోదయం: ఉ 6:38 సూర్యాస్తమయం : సా‌.5:49 తిథి: పుష్య బహుళ ఏకాదశి రా.8:41 వరకు తదుపరి ద్వాదశి సంస్కృతవారం: భృగువాసరః (శుక్రవారం) నక్షత్రము : జ్యేష్ట రా.2:52...

హైదరాబాద్ కు ఉన్న అనుకూలతలు మరే నగరానికీ లేవు: కేటీఆర్

దేశంలో మరే నగరానికీ లేనన్ని సౌకర్యాలు, అనుకూలతలు హైదరాబాద్ కు మాత్రమే ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రాబోయే 50 ఏళ్లు దృష్టిలో ఉంచుకుని ఏ ప్రాజెక్టుకైనా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. మణికొండ...

మరోసారి సమంత అదే తరహాలో…

నాగ చైతన్య నుండి విడిపోయాక సమంత సినిమాల విషయంలో అగ్రెసివ్ గా వెళ్తోందన్న వార్త ఒకటి ప్రచారంలో ఉంది. దానికి తగ్గట్లుగానే తన కెరీర్ లో మొదటిసారి ఐటమ్ గర్ల్ గా నటించింది....

దేశంలో 3లక్షలకు దిగువగా కరోనా కేసులు..! అయినా..

మూడు రోజులుగా దేశంలో కరోనా కేసులు కాస్త తక్కువగానే నమోదవుతున్నా.. కరోనా వ్యాప్తి మాత్రం కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 14 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,86,384 మందికి వైరస్...