Switch to English

ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఎత్తేయడమేంటి జగన్‌.?

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 400కి పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సుమారు 141 రెడ్‌ జోన్లను రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా వైరస్‌ తీవ్రత చాలా ఎక్కువగా వుంది. గుంటూరు, కృష్ణా జిల్లాలూ ఇందుకు మినహాయింపేమీ ఆదు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రం ఇంతవరకూ కరోనా వైరస్‌ ‘జాడ’ కన్పించకపోవడం కాస్త ఊరట.

రాష్ట్రం ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో వుంటే, ‘లాక్‌డౌన్‌’ని కేవలం రెడ్‌ జోన్లకే పరిమితం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేయడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ‘లాక్‌డౌన్‌’ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోతుందనీ తెలిసీ, విధిలేని పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయమది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పినట్లు, బతికుంటే బలుసాకు తినొచ్చు. ఇక్కడ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కంటే, దేశ ఆర్థిక వ్యవస్థ కంటే.. ప్రజలే ముఖ్యం. అందుకే, ప్రపంచంలోని చాలా దేశాలు ఆర్థికంగా నష్టపోయినా ఫర్లేదు.. లాక్‌ డౌన్‌ తప్పనిసరి.. అంటున్నాయి. ఒరిస్సాలో కేసుల సంఖ్య తెలుగు రాష్ట్రాలతో పోల్చితే చాలా చాలా తక్కువగా వున్నప్పటికీ, అక్కడ లాక్‌డౌన్‌ని ఏప్రిల్‌ నెలాఖరు వరకు పొడిగించారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం, తమ ప్రజల పట్ల చూపుతున్న శ్రద్ధకు నిదర్శనమది. పంజాబ్‌ కూడా ఇదే బాటలో నడుస్తోంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‘లాక్‌డౌన్‌ పొడిగించాల్సిందే..’ అని ఇప్పటికే నినదించారు.. ప్రధాని దృష్టికి ఈ రోజు ఇంకోసారి తన అభిప్రాయాన్ని తీసుకెళ్ళారు. కరోనా వైరస్‌, ఆంధ్రప్రదేశ్‌లో అదుపు చేయలేని స్థాయిలోనే వుంది. లేకపోతే, ఇంకా రాష్ట్రంలో ప్రతిరోజూ 15కి పైగానే కేసులు ఎందుకు నమోదవుతున్నట్లు.? ఈ రోజు ఇప్పటికే 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ని ఎత్తివేస్తే.. ఆ తర్వాత జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు.? ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమే.. ‘లాక్‌డౌన్‌’ ఎత్తి వేతపై ఆయన వ్యాఖ్యలు.. అంటూ జనబాహుళ్యంలో చర్చ జరుగుతోంది.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

ఇన్ సైడ్ స్టోరీ: కన్నా లక్ష్మీనారాయణ కోడలు సుహారిక మరణం వెనుక గల కారణాలు.?

గత రాత్రి(మే 28న) ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ చిన్నకుమారుడు ఫణింద్ర భార్య సుహారిక అనుమానాస్పదంగా మరణించిందని తెలిపాము. ఈ సుహారిక మరణం గురించి పలు అనుమానులు వెల్లువెత్తుతున్నాయి. మేము ఇన్...

రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇంట్లో విషాదం.!

ఈ కరోనా సమయంలో పలు ఫ్యామిలీలలో విషాద ఛాయలు అలుముకున్న వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల పుట్టింట్లో విషాదం నెలకొంది....

విమాన సర్వీసుల పున:రుద్దరణలో కేంద్రం తీరుపై రాష్ట్రాల మండిపాటు

లాక్ డౌన్ తర్వాత విమాన సర్వీసులు పునరుద్ధరించే విషయంలో మోదీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సర్వీసులు పునరుద్దరించేముందు కేంద్రం అన్ని రాష్ట్రాలతో సంప్రదించి ఉండాల్సింది అని పలు...

డాక్టర్‌ బాబుకు మెగాస్టార్‌ తల్లి ఇచ్చిన గిఫ్ట్‌ ఏంటో తెలుసా?

తెలుగు బుల్లి తెరపై ఇప్పటి వరకు ఎన్నో వందల సీరియల్స్‌ వచ్చాయి. కాని కార్తీక దీపం సీరియల్‌కు వచ్చినంత ప్రజాధరణ ఏ సీరియల్‌కు రాలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కార్తీక దీపం...

చంద్రబాబు: స్వపక్షాన్నీ కొనక తప్పదా?

ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితుల్లో ఉంది. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీని తట్టుకుని మరో నాలుగేళ్లు ఎలా పోరాడాలా అని...