ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నానాటికీ అత్యంత హేయమైన, జుగుప్సాకరమైన రీతిలోకి మారుతున్నాయి. ‘ఎవడికి పుట్టావ్.?’ అంటూ నిస్సిగ్గుగా విమర్శించుకునే రాజకీయ నాయకులున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇప్పుడేమో, ‘పెళ్ళాల పాతివ్రత్యం’ గురించి విమర్శించుకుంటున్నారు.. ఏకంగా గోడల మీదకెక్కించేసుకుంటున్నారు తమ పైత్యాన్ని.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిని రాజకీయంగా టార్గెట్ చేసే క్రమంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి మీద గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు అత్యంత జుగుప్సాకరమైన రీతిలో తూలనాడిన సంగతి తెలిసిందే.
చంద్రబాబుకీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ మధ్య రాజకీయంగా విబేధాలుండొచ్చుగాక. జగన్ పుట్టినరోజునాడు చంద్రబాబు విషెస్ చెబుతున్నారు. చంద్రబాబు పుట్టినరోజుకి వైఎస్ జగన్ విషెస్ అందిస్తున్నారు. మధ్యలో ఈ రాజకీయ నపుంసకులకి (ఇలా అనాల్సి వస్తుండడం అత్యంత బాధాకరం) వచ్చిన నొప్పి ఏంటి.?
వైఎస్ జగన్ సతీమణి భారతి మీద జుగుప్సాకరమైన విమర్శలు చేస్తే అదీ ఖండించాల్సిన విషయమే. చంద్రబాబ సతీమణి భువనేశ్వరి మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే, దాన్నీ ఖండించాల్సిందే. వీళ్ళు వాళ్ళనేదో అన్నారని, వాళ్ళు వీళ్ళను ఇంకెటేదో అనేస్తోంటే, అంతిమంగా తమ కుటుంబంలోని మహిళల ఆత్మ గౌరవం రోడ్డున పడుతోందని ఇటు చంద్రబాబు అటు వైఎస్ జగన్ ముందుగా గుర్తెరగాలి.
చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మీద వివాదాస్పద రాతలతో ‘నా పెళ్ళాం పతివ్రత’ అనే పోస్టర్లను తయారు చేయించారు కొందరు. ఈ ఘాతుకానికి వైసీపీ శ్రేణులే పాల్పడతాయన్నది నిర్వివాదాంశం. ఆటోమేటిక్‌గా వైఎస్ భారతి మీద కూడా ఇలాంటి పోస్టర్లే పడతాయ్ కదా.?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తన పార్టీకి చెందిన నేతల మీద అదుపు లేదు. సేమ్ టు సేమ్ చంద్రబాబుకి కూడా. వీళ్ళిద్దరూ రోడ్డున పడి విమర్శలు చేసుకుంటే అది వేరే వ్యవహారం. కానీ, వీళ్ళ భార్యల్ని వివాదాల్లోకి లాగడమేంటి.? కాస్తంత అయినా ఇంగితం వుండాలి కదా.?
ఒకరేమో ముఖ్యమంత్రి, ఇంకొకరేమో ప్రతిపక్ష నేత. వీళ్ళ కుటుంబాల్లోని ఆడవాళ్ళ ఆత్మగౌరవానికే దిక్కులేకపోతే, వీళ్ళసలు రాష్ట్రాల్లో రాజకీయాలు చేయడానికి అర్హులా.? సిగ్గు సిగ్గు.!
778815 377897Some truly marvelous work on behalf with the owner of this internet web site , dead fantastic articles . 566244
576370 671109dress shops that offer discounts are extremely common in our spot and i always shop at them,. 621807
702554 19933extremely excellent post, i certainly love this excellent website, keep on it 778456
54603 19763hello!,I like your writing so significantly! share we communicate extra approximately your post on AOL? I want an expert in this space to solve my problem. Perhaps that is you! Looking ahead to see you. 577062